
బాబీ, వినీత్ చంద్ర, అని షిండే
‘‘జగదానంద కారక’ టైటిల్ పాజిటివ్‌గా ఉంది. టైటిల్ లోగో బాగా నచ్చింది. నా సినిమా ‘జై లవకుశ’ తరహా పాజిటివిటీ కనిపించింది. ‘జగదానంద కారక’ కూడా ‘జై లవకుశ’ అంత హిట్ అవ్వాలి’’ అని డైరెక్టర్ బాబీ అన్నారు. వినీత్ చంద్ర, అని షిండేలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ, రామ్ భీమన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జగదానంద కారక. వెంకటరత్నం నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శక– నిర్మాత వీరశంకర్ స్క్రిప్టును చిత్రయూనిట్‌కి అందించగా, దర్శకుడు బాబీ క్లాప్ కొట్టారు. రామ్ భీమన మాట్లాడుతూ– ‘‘ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. కడియం–రాజమండ్రి పరిసరాల్లో చిత్రీకరణ జరుపుతాం’’ అన్నారు. ‘‘ఆకతాయి’ తర్వాత మళ్లీ రామ్ భీమనతో సినిమా చేస్తున్నాం’’ అన్నారు లైన్ ప్రొడ్యూసర్ సతీష్ కుమార్. ఈ చిత్రానికి మరో లైన్ ప్రొడ్యూసర్: మాదాసు వెంగళరావు.
Comments
Please login to add a commentAdd a comment