
వాటితో తృప్తి లేదు
ఆ అవకాశాలు తృప్తి కలిగించలేదు, అందుకే అంగీకరించలేదు అంటోంది నటి ఇషా తల్వార్. ఈ బ్యూటీ తిల్లుముల్లు చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ చిత్రం హిట్టయినా అమ్మడికి మరో అవకాశం రాలేదు. దీనిపై ఈ ఉత్తరాది భామ బదులిస్తూ తాను మలయాళంలో పలు చిత్రాలు చేశానని తెలిపింది. హమారా దిల్ ఆప్ కే పాస్ హై చిత్రంలో పృథ్వికి చెల్లెలిగా నటించానని చెప్పింది. దీంతో రెండో హీరోయిన్ అవకాశాలు రావ డం మొదలైనట్లు చెప్పింది.
అలాంటి పాత్రలు చేయడం తనకిష్టం లేదని అంది. తాను హీరోయిన్‌గానే నటించాలని భావిస్తున్నానన్నారు. అందుకే సెకండ్ హీరోయిన్ అవకాశాలు నిరాకరించినట్లు పేర్కొంది. ఇటీవల తెలుగులో మైనేప్యార్‌కియా చిత్రంలో హీరోయిన్‌గా చేశానని చెప్పింది. తమిళంలో తొలి చిత్రం తిల్లుముల్లు తరువాత వచ్చిన అవకాశాల్లో ఏదీ సంతృప్తి కలిగించకపోవడంతో అంగీకరించలేదని చెప్పింది. మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నట్లు ఇషా సెలవిచ్చింది.