Isha Talwar
-
ఈ పాప తెలుగు హీరోయిన్.. ఫస్ట్ మూవీనే సూపర్ హిట్.. ఎవరో కనిపెట్టారా?
ఈమె తెలుగు హీరోయిన్. అంటే పదుల సంఖ్యలో సినిమాలేం చేసేయలేదు. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడమే సూపర్ హిట్ కొట్టేసింది. ఆ తర్వాత ఇక్కడ మూవీస్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది. దీంతో ఛాన్సులే రావడం మానేశాయి. అయితేనేం బాలీవుడ్లో చెక్కేసింది. సినిమాలు-వెబ్ సిరీసులు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్మే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు ఇషా తల్వార్. అరె.. ఈ పేరు ఎక్కడా గుర్తురావట్లేదే? అని అనుకుంటున్నారా? అస్సలు కంగారు పడకండి. మేం చెప్పేస్తాం. అప్పట్లో 'ఇష్క్' మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత హిట్ కొట్టిన నితిన్.. అదే ఊపులో 'గుండె జారి గల్లంతయ్యిందే' అని మరో మూవీ చేశాడు. ఇందులో నిత్యామేనన్ మంచి స్కోప్ ఉండే పాత్ర చేసింది. అదే టైంలో మరో హీరోయిన్గా చేసిన ఇషా తల్వార్ కూడా బాగానే ఫేమ్ తెచ్చుకుంది. (ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!) అయితే నితిన్ మూవీ తర్వాత 'మైనే ప్యార్ కియా', 'రాజా చెయ్యి వేస్తే' అని మరో రెండు సినిమాల్లో ఇషా తల్వార్ హీరోయిన్గా చేసింది. కానీ లక్ అన్నదే అస్సలు కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. 2012లో నటిగా ఎంట్రీ ఇచ్చినప్పుడు వరసపెట్టి మలయాళ మూవీస్ చేసింది గానీ టాలీవుడ్ నుంచి వెళ్లిపోయిన తర్వాత మాత్రం పూర్తిగా హిందీకే పరిమితమైపోయింది. హీరోయిన్ అనే కాకుండా 'మీర్జాపూర్' లాంటి ఫేమస్ వెబ్ సిరీస్‌లోనూ గుర్తింపు ఉన్న పాత్ర చేసింది. 2023లోనూ సాస్-బాహు ఔర్ ఫ్లెమింగో, చమక్ లాంటి సిరీసుల్లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతానికైతే అటు మూవీస్ ఇటు సిరీసులు చేసుకుంటూ బండి నడిపేస్తోంది. వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 36 ఏళ్లు వయసొచ్చినా సరే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?) View this post on Instagram A post shared by Isha Talwar (@talwarisha) -
శర్మాజీ నమ్కీన్... ఓ రిటైరైన నాన్న కథ
‘అమితాబ్ బచ్చన్ రిటైర్ కాలేదు. నేనెందుకు కావాలి’ అంటాడు ఈ సినిమాలో శర్మాజీ అనే తండ్రి. అమితాబ్‌కు 78. శర్మాజీకి 58. వి.ఎర్.ఎస్ ఇవ్వడం వల్లో రిటైర్మెంట్ వల్లో తండ్రులు పనికి దూరం అవుతారు. ఇక వారి జీవితం ముగిసినట్టేనా? ఆశలు, ఆకాంక్షలు అంతమేనా? అసలు రిటైర్ అయిన తండ్రులను ఎంతమంది పిల్లలు అర్థం చేసుకుంటున్నారు? రిషి కపూర్ చివరి సినిమా ‘శర్మాజీ నమ్కీన్’. మరో విశేషం ఏమంటే రిషి మరణం వల్ల మిగిలిన సినిమాని అదే పాత్ర పోషించి పరేశ్ రావెల్ మెప్పించటం! ఈ వారం సండే సినిమా. ఈ సినిమాలో రిటైర్ అయిన శర్మాజీ, అతని స్నేహితుడు ‘బాగ్బన్’లోని క్లయిమాక్స్‌ను ఫోన్లో చూస్తుంటారు. శర్మాజీ ఫ్రెండ్ అయిన శిక్కు చెడ్డా ‘దీనిని కాలేజీ పిలకాయలందరికీ సిలబస్‌గా పెట్టాలి’ అంటాడు. ఎందుకంటే అమితాబ్– హేమమాలిని నటించిన బాగ్బన్లో పిల్లల నిర్లక్ష్యానికి లోనయ్యే తల్లిదండ్రులను చూపిస్తారు. అయితే ‘శర్మాజీ నమ్కిన్’ ఈ సమస్యను తీసుకోకుండా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండే గ్యాప్‌ను చర్చిస్తుంది. వారి వైపు ఉండే కథలను వినాలని చెబుతుంది. కథ ఏమిటి? ఢిల్లీలో మిడిల్‌క్లాస్ కాలనీలో ఉండే శర్మాజీ (రిషి కపూర్) తాను పని చేసే మిక్సీ, గ్రైండర్ తయారీ ఫ్యాక్టరీ నుంచి వి.ఆర్.ఎస్. తీసుకుంటాడు. అంటే ఫ్యాక్టరీయే అతనికి వి.ఎర్.ఎస్. ఇచ్చి పంపిస్తుంది, అది దివాలా తీయడంతో. ఇంట్లో భార్య ఉండదు. చాలా ఏళ్ల క్రితమే డబుల్ టైఫాయిడ్ తో చనిపోయి ఉంటుంది. పెద్ద కొడుకు ఉద్యోగం. చిన్న కొడుకు కాలేజీ. శర్మాజీకి ఉత్సాహం ఉంది. జీవితాన్ని ఆస్వాదించాలని ఉంది. ఏదో ఒకటి చేస్తూ పనికొచ్చేలా ఉండాలని ఉంది. టీవీ చూసి చూసి, ఖాళీగా ఉండి ఉండి బోర్ కొడుతుంది. ‘నాకు బోర్ కొడుతుంది’ అని పిల్లలతో అంటే ‘ట్రావెల్ చెయ్యి. లేదా రెస్ట్ తీసుకుని ఎంజాయ్ చెయ్యి’ అంటారు తప్ప ఇంకో పనేదైనా చేస్తానంటే ఒప్పుకోరు. 58 ఏళ్లొస్తే ఏ పని చేయకుండా ఎందుకు ఉండాలి ఇదేం రూలు అంటాడు శర్మాజీ. చివరకు అతని ఫ్రెండ్ అతనికి ఒక సలహా ఇస్తాడు. ‘నీకు వంట బాగా వచ్చు కదా. నాకు తెలిసిన వాళ్లు కిట్టీ పార్టీలు చేసుకుంటూ మంచి వంటవాడు కావాలంటుంటాడు. నువ్వెళ్లి వండు. కాలక్షేపం.’ అంటాడు. శర్మాజీకి నిజంగానే వంట బాగా వచ్చు. ‘ఇంత బతుకు బతికి వంటవాడిగా మారడమా’ అని ముందు తటపటాయించినా చివరకు అంగీకరిస్తాడు. అలా కిట్టీ పార్టీలు చేసుకునే ఒక స్త్రీల బ్యాచ్‌తో అతనికి స్నేహం ఏర్పడుతుంది. ఇదంతా కొన్నాళ్లు పిల్లలకు తెలియకుండా జరిగినా ఆ తర్వాత పిల్లలకు తెలియడంతో వాళ్లు మా పరువేం కాను అని గొడవకు దిగుతారు. చివరకు ఇద్దరూ ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారన్నది క్లయిమాక్స్. వారి మనసులో ఏముంది? ‘శర్మాజీ నమ్కిన్’లో దర్శకుడు తెలివిగా ఒక విషయాన్ని చెబుతాడు. రిటైర్ అయిన తల్లిదండ్రుల భావోద్వేగాలు ఏమిటో ఎవరూ పట్టించుకోరు అనేది ఒకటి– మిడిల్ ఏజ్‌కు వచ్చిన వివాహిత స్త్రీలు తమకు వ్యాపకాలు లేక చేసేందుకు పని లేక కుటుంబాలకే జీవితాలు అంకితం చేసి చేసి విసిగిపోతున్నారనేది ఒకటి. శర్మాజీ లాంటి రిటైర్ అయిన వాళ్లు, కిట్టీ పార్టీ చేసుకునే మధ్య వయసు స్త్రీలు ఒకరి సమస్యను మరొకరు సానుభూతితో అర్థం చేసుకుంటారు. ఒకరికి మరొకరు సపోర్ట్‌గా నిలుస్తారు. అలాగే శర్మాజీ పెద్ద కొడుకు తనకు ఉద్యోగంలో ప్రమోషన్ రాగానే ఇంటి నిర్ణయాలు తానే తీసుకోగలను అనుకుంటూ ఉంటాడు. ఆ మిడిల్ క్లాస్ ఇంటి నుంచి పెద్ద ఫ్లాట్‌లోకి మారాలని అతని కోరిక. ఇక్కడే మీ అమ్మ చనిపోయింది... నేను కూడా ఇక్కడే పోతాను... రాను అని తండ్రి అంటుంటాడు. తనకు బయట ఏవైనా సమస్యలు వస్తే తండ్రితో మనసు విప్పి చెప్పుకోడు. అలాగే తండ్రి కూడా తన మనసులో ఏముందో చెప్పుకునేంత స్పేస్ ఇవ్వడు. ఇలాంటి పిల్లలు ఇప్పుడు అన్ని చోట్లా ఉన్నారు. శర్మాజీ వంటి తండ్రులు కూడా. వీళ్లు తమను ఈ సినిమాలో చూసుకుంటారు. రిషి చివరి సినిమా రిషి కపూర్ ఈ సినిమా యాభై శాతం ముగించాక అనారోగ్యం వల్ల మరణించాడు. సినిమా ఎలా పూర్తి చేయాలనే సమస్య వచ్చింది. రణ్‌బీర్ కపూర్ తాను ఆ వేషాన్ని పూర్తి చేద్దామని అనుకున్నాడు. చివరకు పరేష్ రావెల్ తాను మిగిలిన పోర్షన్ చేస్తానని ముందుకు వచ్చాడు. రిషి కపూర్ పూర్తి చేయని సీన్లన్నీ పరేష్ చేశాడు. అంటే సినిమా అంతా ముందు వెనుకలుగా రిషి కపూర్, పరేశ్ రావెల్ వస్తూనే ఉంటారు. అయితే ఇద్దరూ మంచి నటులు కాబట్టి ఆడియెన్స్ అసౌకర్యంగా భావించరు. కాని రిషి కపూర్ ఎక్కువ నచ్చుతాడు. జూహీ చావ్లా చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో రిషి కపూర్ పక్కన కనిపిస్తుంది. సినిమా మొదట్లో రణ్‌బీర్ తన తండ్రి నటించిన ఈ సినిమా గురించి భావోద్వేగంతో మాట్లాడతాడు. సినిమా ముగిశాక రిషి కపూర్ ఆన్ లొకేషన్ షాట్స్ రన్ అవుతూ ఉంటే ఇన్నాళ్ల పాటు అతడు పంచిన వినోదం, అతడు ఇచ్చిన సినిమాలు గుర్తొచ్చి మనసు భారం అవుతుంది. తేలికపాటి హాస్యంతో సాగిపోయే ఈ సినిమా అమేజాన్ ప్రైమ్‌లో మార్చి 31న విడుదలైంది. చూడండి. -
మీర్జాపూర్ వెబ్ సిరీస్ వివాదం.. హైకోర్టు కీలక నిర్ణయం
అలహాబాద్: మీర్జాపూర్ వెబ్ సిరీస్ రూపకర్తలకు ఊరట లభించింది. నిర్మాతలు ఫర్హాన్ అఖర్, రితేష్ సిధ్వానీలపై దాఖలైన ఎఫ్ఐఆర్ను అలహాబాద్ హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది. జస్టిస్ ఎంసీ త్రిపాఠి, జస్టిస్ సుభాష్ విద్యార్థిలతో కూడిన బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. దర్శక-రచయితలు కరణ్ అన్షుమాన్, గుర్మీత్ సింగ్, పునీత్ కృష్ణ, వినీత్ కృష్ణలపై నమోదైన ఎఫ్ఐఆర్ను కూడా హైకోర్టు రద్దు చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రతిష్టకు భంగం కలిగేలా వెబ్ సిరీస్ రూపొందించారని ఆరోపిస్తూ కొత్వాలి దేహత్ పోలీస్ స్టేషన్ (మీర్జాపూర్)లో స్థానిక జర్నలిస్ట్ అరవింద్ చతుర్వేది జనవరి, 17న ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 295-ఏ, 504, 505, 34, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67-ఏ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వెబ్ సిరీస్‌లో మీర్జాపూర్ పట్టణాన్ని చెడుగా చిత్రీకరించి మత, సామాజిక, ప్రాంతీయ మనోభావాలను దెబ్బతీశారని పిటిషనర్ ఆరోపించారు. తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ ముందుగా నిర్మాతలు కోర్టు ఆశ్రయించారు. తర్వాత దర్శక-రచయితలు కూడా న్యాయస్థానం తలుపు తట్టారు. జనవరి, ఫిబ్రవరిలో వీరిని అరెస్ట్ చేయకుండా కోర్టు ఆదేశిలిచ్చింది. మీర్జాపూర్ వెబ్ సిరీస్ పూర్తిగా కల్పితమని, అన్ని మతాలను తాము గౌరవిస్తామని అంతకుముందు ఉన్నత న్యాయస్థానానికి వీరు విన్నవించుకున్నారు. వీరి వాదనలను పరిగణనలోకి తీసుకుని ఎఫ్ఐఆర్లను కోర్టు రద్దు చేసింది. (చదవండి: సినిమా చూసేందుకు ఆటోలో వచ్చిన స్టార్ హీరోయిన్) అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో విడుదలైన మీర్జాపూర్ వెబ్ సిరీస్‌కు వీక్షకుల నుంచి ఆదరణ లభించింది. ఇప్పటికే రెండు సిరీస్‌లు విడుదలయ్యాయి. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజాల్, దివ్యేందు శర్మ, కుల్‌భూషణ్ ఖర్బందా, రసికా దుగల్, శ్వేతా త్రిపాఠి, ప్రమోద్ పాఠక్, హర్షిత గౌర్, షాజీ చౌదరి తదితరులు నటించారు. ఇదిలావుంటే మూడో మీర్జాపూర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కోసం వీక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (చదవండి: మీ మగబుద్ధే వంకరబుద్ధి అంటున్న సమంత!) -
చూడ్డానికి జూనియర్ కత్రినా కైఫ్‌లా..
చూడ్డానికి జూనియర్ కత్రినా కైఫ్‌లా ఉండే ఇషా తల్వార్.. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రముఖ దర్శక, నిర్మాత వినోద్ తల్వార్ కుమార్తే ఈ ఇషా తల్వార్. డాన్సింగ్, మోడలింగ్, యాక్టింగ్ ఇలా మల్టీ టాలెంట్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇషా.. మలయాళ భాషా చిత్రాల్లో ఎక్కువగా మెరిశారు. పాకిస్తాన్ మూలాలున్న ఇషా తల్వార్.. పుట్టింది, పెరిగింది ముంభైలోనే. 1987 డిసెంబర్ 22 జన్మించిన ఇషా.. 2008లో సెయింట్ జేవియర్స్ కళాశాలలో చదువుకుంది. 2004లో నృత్య దర్శకుడు తెరెన్స్ లెవిస్ నృత్య పాఠశాలలో చేరి, సల్సా, హిప్ హాప్, బాలే, జాజ్ వంటి నృత్య రీతులు నేర్చుకుంది. ఆ తరువాత అదే డ్యాన్స్ అకాడమీలో టీచర్‌గా కూడా చేరింది. ‘నన్ను పూర్తిగా మార్చిన వ్యక్తి లెవిస్’ అని చెప్పుకుంటుంది ఇషా. ఎన్నో యాడ్స్‌లో మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఇషా.. 2012లో మళయాళ చిత్రం ‘తట్టతిన్ మరయతు’తో తెరంగేట్రం చేసింది. అందులో ముస్లిం అమ్మాయిగా కనిపించిన ఇషా తల్వార్‌కు.. విమర్శకుల ప్రశంసలూ అందాయి. పిజ్జా హట్, కాయా స్కిన్ క్లినిక్, డ్యూలక్స్ పెయింట్స్, మేగీ హాట్ హెడ్స్, వైవల్ ఫెయిర్‌నెస్ క్రీమ్ వంటి కమర్షియల్ యాడ్స్‌కి ఇషా తల్వార్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. 2013లో ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో తెలుగులో ఆరంగేట్రం చేసిన ఇషా.. చివరిగా ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమాలో మెరిసింది. మొదటి సినిమా అయిన ‘తట్టతిన్ మరయతు’ సినిమాతోనే పలు అవార్డ్స్ అందుకున్న ఇషా.. ‘హోమ్ స్వీట్ ఆఫీస్’ అనే వెబ్ సిరీస్‌తో మరింత గుర్తింపు తెచ్చుకుంది. ‘తట్టతిన్ మరయతులోని క్యారెక్టర్ నాకు చాలా గుర్తింపు తెచ్చింది. ఆ పాత్ర దొరకడం నిజంగా చాలా సంతోషం.. అది నా కెరీర్‌కి ఎంతో ఉపయోగపడింది’ అంటుంది ఇషా తల్వార్. -
4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా
గ్లామర్, డీగ్లామర్ అనే తేడా లేకుండా నటనలో బహుముఖి అనిపించుకుంటోంది ఇషా తల్వార్. బాలీవుడ్ నిర్మాత వినోద్ తల్వార్ కూతురైన ఇషా ముంబైలో పుట్టి పెరిగింది. ఎకనామిక్స్‌లో పట్టా అందుకుంది. ఐ లవ్ మీ(మలయాళం), థిల్లు ముల్లు–2 (తమిళం), గుండెజారి గల్లంతయిందే (తెలుగు)లాంటి హిట్ సినిమాలలో నటించిన ఇషా తాజాగా బాలీవుడ్ సినిమా ‘ఆర్టికల్ 15’తో ‘అదితి’ పాత్రతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇషా గురించి మినీ సంగతులు... గ్లామర్: దుస్తుల్లో కాదు వ్యక్తిత్వంలో ప్రతిఫలించేది. దృష్టి: ఎప్పుడూ వాణిజ్యదృష్టి మాత్రమే కాదు... అందుకు భిన్నమైన దృష్టి కూడా ఉండాలి. అప్పుడే మంచి చిత్రాలు చేయగలుగుతాము. సినిమాలకు ముందు: కమర్షియల్ యాడ్స్‌లో నటించాను. డ్యాన్స్: చాలా ఇష్టం. టెరెన్స్ డ్యాన్స్ స్కూల్లో శిక్షణ తీసుకున్నాను. బాలే, జాజ్, సల్సా, హిప్–హాప్లలో ప్రవేశం ఉంది. బోర్: ఒకేరకమైన పాత్రలు మళ్లీ మళ్లీ చేయడం. నా మొదటి సినిమాలో డీగ్లామర్ రోల్ చేశాను. రెండో సినిమాలో కూడా అలాగే చేసి ఉంటే వరుస పెట్టి అలాంటి పాత్రలే వచ్చేవి. అదృష్టవశాత్తు రెండో సినిమాలో అలాంటి పాత్ర చేయలేదు. నచ్చనిది: ‘సక్సెస్ఫుల్ యాక్ట్రెస్’ అని పిలిపించుకోవాలనుకోవడం. నమ్మేది: రాశి కంటే వాసి ముఖ్యం. ప్రతిభ నిరూపించుకోవడానికి ఎడాపెడా సినిమాలు చేయనక్కర్లేదు. కలకాలం గుర్తుండేలా కొన్ని సినిమాలు చేసినా చాలు. ప్రేక్షకులు: గౌరవనీయ వ్యక్తులు. వాళ్లు డబ్బు పెట్టి సినిమాకు వస్తేనే కదా సినిమాలు బతికేవి! ఒకరు ‘జీరో’ అయినా ‘హీరో’ అయినా అది వారి మీదే ఆధారపడి ఉంటుంది. సంతోషం: మొదటి సినిమా హిట్ కావడం. (తట్టతిన్ మరయతు–మలయాళం) ఆ తరువాత: ‘ఆ తరువాత ఏంటి?’ అనేది అవసరమేగానీ అదే ప్రధానమైపోతే... చేస్తున్న పనికి న్యాయం చేయలేం. 4జీ: ఒక సినిమాను ఎంపిక చేసుకునేటప్పుడు 4జీ గురించి ఆలోచిస్తాను. 1. గుడ్ డైరెక్టర్, 2. గుడ్ స్క్రిప్ట్, 3. గుడ్ ప్రొడక్షన్ హౌస్, 4. గుడ్ టీం. నచ్చేవి: నాలోని నటనను మెరుగు పరిచే పాత్రలు. డ్రీమ్‌రోల్: ‘డ్రీమ్‌రోల్’ అని ప్రత్యేకంగా ఏదీ లేదు. చేస్తున్న ప్రతిరోల్ను డ్రీమ్రోల్గానే భావిస్తాను. ఇష్టమైన ప్రదేశం: పొలాచ్చి ఇబ్బంది: చేసిన సినిమానే రీమేక్ రూపంలో మళ్లీ చేయడం. అయితే కొన్ని సందర్భాలలో తప్పదు! తేలిక–కష్టం: మాయ చేసి బతకడం తేలిక. నిజాయతీగా బతకడం చాలా కష్టం. -
ఇషా తల్వార్‌కు మరో చాన్స్
తన అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి నటి ఇషా తల్వార్‌కు మరో అవకాశం తలుపుతట్టింది. ఈ ఉత్తరాది భామ ఇంతకు ముందు రజనీకాంత్ సూపర్‌హిట్ చిత్రం తిల్లు ముల్లు రీమేక్‌లో నటించింది. మిర్చి శివ హీరోగా నటించిన ఆ చిత్రం అమ్మడికి ఎలాంటి హెల్ప్ అవ్వలేదు. దీంతో మలయాళ చిత్ర పరిశ్రమపై కన్నేసింది.అయితే అక్కడ ఇషాతల్వార్ క్లిక్ అయ్యింది. మలయాళంలో తను నటించిన తట్టత్తిన్ మరైయత్తు అనే చిత్రం మంచి విజయాన్ని సాధించింది.అంతే కాదు ఆ చిత్రం ఈ భామకు మరోసారి తమిళంలో నటించే అవకాశాన్ని కల్పించింది. అవును మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన తట్టత్తిన్ మరైయత్తు చిత్రం ఇప్పుడు తమిళంలో పునర్నిర్మాణం అవుతోంది. ఇందులో హీరోయిన్గా ఇషా తల్వార్నే నటిస్తోంది. హీరోగా నవ నటుడు వాల్టర్ ఫిలిప్స్ పరిచయం అవుతున్నారు. దీన్ని ఎస్వీడీ పతాకంపై జయచంద్రన్ నిర్మిస్తున్నారు. జవహర్ ఆర్.మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ఆయన బాణీలు కట్టిన మైపొట్టు మైపొట్టు అనే పాట ఏప్రిల్ ఒకటో తేదీన యూ ట్యూట్లో విడుదలై హల్చల్ చేస్తోంది. ఇది వివాహ తంతు నేపథ్యంలో సాగే పాట అని చిత్ర వర్గాలు వెల్లడించారు. ఈ చిత్రాన్ని కలైపులి ఇంటర్నేషనల్ సంస్థ విడుదల హక్కుల్ని పొందినట్లు తెలిపారు. మలయాళంలో తనకు అడ్రస్ నిచ్చిన ఈ చిత్రం తమిళంలోనూ మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందనే ఆశాభావంతో ఇషా తల్వార్ ఉందట. మరి ఈ జానకలల్ని ఈ చిత్రం ఎంత వరకు నిజం చేస్తుందో వేచి చూడాల్సిందే. -
ఇషాకు మరో ఛాన్స్
నటి ఇషా తల్వర్ గుర్తుందా? ఆ మధ్య మిర్చి శివతో తిల్లుముల్లు చిత్రంలో జతకట్టింది. ఆ ఒక్క చిత్రంతోనే సరిపెట్టుకుని మలయాళం తదితర ఇతర భాషలపై దృష్టి పెట్టిన ఈ బ్యూటీకి తాజాగా తమిళంలో మరో అవకాశం వచ్చింది. నటుడు ధనుష్‌తో వరుసగా యారడీ నీ మోహిని, ఉత్తమ పుత్రన్ చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు జవహర్ కొంచెం గ్యాప్ తరువాత మళ్లీ మెగా ఫోన్ పడుతున్నారు. మలయాళంలో విజయం సాధించిన తట్టత్తిన్ మరయాదు చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మలయాళంలో నటి ఐషా నటించిన పాత్రను తమిళంలో ఇషా తల్వర్ పోషించనుంది. దీనిపై దర్శకుడు జవహర్ తెలుపుతూ మలయాళ చిత్రం తట్టత్తిన్ మరయాదు చిత్రం రీమేక్‌లో ఇషాతల్వర్ను ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. హీరోగా నూతన నటుడు నటించనున్నట్లు వెల్లడించారు. చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు. తన ఉత్తమ పుత్రన్ చిత్రానికి పని చేసిన విష్ణుశర్మ, ఎం.త్యాగరాజన్‌లు ఈ చిత్రానికి చాయాగ్రహణం అందించనున్నట్లు దర్శకుడు తెలిపారు. మొత్తంమీద ఇషా తల్వర్కు చాన్నాళ్ల తరువాత కోలీవుడ్‌లో మరో అవకాశం వచ్చింది. -
వాటితో తృప్తి లేదు
ఆ అవకాశాలు తృప్తి కలిగించలేదు, అందుకే అంగీకరించలేదు అంటోంది నటి ఇషా తల్వార్. ఈ బ్యూటీ తిల్లుముల్లు చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ చిత్రం హిట్టయినా అమ్మడికి మరో అవకాశం రాలేదు. దీనిపై ఈ ఉత్తరాది భామ బదులిస్తూ తాను మలయాళంలో పలు చిత్రాలు చేశానని తెలిపింది. హమారా దిల్ ఆప్ కే పాస్ హై చిత్రంలో పృథ్వికి చెల్లెలిగా నటించానని చెప్పింది. దీంతో రెండో హీరోయిన్ అవకాశాలు రావ డం మొదలైనట్లు చెప్పింది. అలాంటి పాత్రలు చేయడం తనకిష్టం లేదని అంది. తాను హీరోయిన్‌గానే నటించాలని భావిస్తున్నానన్నారు. అందుకే సెకండ్ హీరోయిన్ అవకాశాలు నిరాకరించినట్లు పేర్కొంది. ఇటీవల తెలుగులో మైనేప్యార్కియా చిత్రంలో హీరోయిన్గా చేశానని చెప్పింది. తమిళంలో తొలి చిత్రం తిల్లుముల్లు తరువాత వచ్చిన అవకాశాల్లో ఏదీ సంతృప్తి కలిగించకపోవడంతో అంగీకరించలేదని చెప్పింది. మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నట్లు ఇషా సెలవిచ్చింది. -
'మైనే ప్యార్ కియా' టీంతో చిట్ చాట్
-
ఆటో రైడ్ ని నిర్వహించిన 'మైనే ప్యార్ కియా' టీమ్
-
సినిమా రివ్యూ: 'మైనే ప్యార్ కియా'
ఒకప్పడు హిందీలో 'మైనే ప్యార్ కియా' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దర్శకుడు ప్రదీప్ మాడుగుల 'మైనే ప్యార్ కియా' చిత్ర టైటిల్ తో రూపొందించిన చిత్రం జూన్ 20 తేదిన విడుదలైంది. 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్ర 'ఫేం' ఇషా తల్వార్, ప్రదీప్ బెంటో నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకుందా అనే విషయాని తెలుసుకోవాలంటే కథంటే తెలుసుకోవాల్సిందే. ఇషా తల్వార్, ప్రదీప్ లు చిన్న నాటి స్నేహితులు. చిన్నతనంలో ఎప్పడూ గొడవ పడుతుంటారు...వారు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగులుగా చేరుతారు. వారం రోజుల్లో నిశ్చితార్ధం జరిగే ఇషాను చూసి మనసు పడుతాడు. తన ప్రేమను ఇషాకు తెలియ చేస్తాడు. ప్రదీప్ ను ఇష్టపడుతున్నానని తెలుసుకున్న ఇషా తన మనసులోని మాటా చెప్పలానుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ కు ముందు ఓ కారణంగా ప్రదీప్ అంటే ఇషాకు అసహ్యం ఏర్పడుతుంది. ప్రదీప్ ను అసహ్యించుకోవడానికి కారణమేమిటి? ప్రదీప్, ఇషాల మధ్య నెలకొన్న మనస్పర్ధలు ఎలా తొలగించుకున్నారు అనే ప్రశ్నలకు సమాధానమే 'మైనే ప్యార్ కియా'. నవీన్ గా ప్రదీప్, శాలినిగా ఇషా తల్వార్ లు నటించారు. గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన ఇషా తల్వార్ మరోసారి మైనే ప్యార్ కియాతో ఆకట్టుకున్నారు. గ్లామర్ నే కాకుండా అభినయంతో కూడా పర్వాలేదనిపించింది. కొన్ని సన్నివేశాల్లో ప్రదీప్ యాక్టింగ్ బాగుంది. అయితే వీరిద్దరీ ఫెర్ఫార్మెన్స్ 'మైనే ప్యార్ కియా'ను విజయం దిశగా నడిపిస్తారా అంటే సమాధానం కష్టమే. ప్రదీప్ స్నేహితుడిగా వేణు పర్వాలేనిపించారు. స్వలింగ సంపర్కుడిగా నటించిన పోసాని కృష్ణమురళి మెప్పించలేకపోయారు. సత్యదేవ్, స్వప్నమాధురిల పాత్రలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. కొంతలో కొంత సత్యదేవ్, స్వప్న మాధురిలు సెకండాఫ్ లో కొంత ఇంట్రెస్ క్రియేట్ చేసినా సినిమాకు పాజిటివ్ గా మలచలేకపోయారు. సాదాసీదా కథకు ఫోటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కొంత మెరుగులు దిద్దారు. క్వాలిటీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సంతోష్ నారాయణ్ ఆలరించారు. ఫోటోగ్రఫి చాలా రిచ్ గా ఉంది. మాస్ డైలాగ్స్ తో కొంత ఆకట్టుకునే ప్రయత్నం జరిగింది. సింపుల్ కథతో 'మైనే ప్యార్ కియా' అందించిన ప్రదీప్ మాడుగుల కథనంపై సరైన దృష్టిని పెట్టాలేదనే అభిప్రాయం కలుగుతుంది. కథనం పేలవంగా ఉండటంతో సినిమాపై పట్టు సడలిందనే భావన కలుగుతుంది. అటు మల్టీ ప్లెక్స్ ఆడియెన్స్ కు, బీసీ ప్రేక్షకుల అభిరుచి దూరంగా ఉన్న 'మైనే ప్యార్ కియా'కు సక్సెస్ ను సొంత చేసుకుంటుందా అని చెప్పడం కష్టమే. -
ఏడాది తర్వాత... వస్తున్నా!
‘‘సంస్కృతానికి దగ్గరగా ఉంటుంది తెలుగు. అందుకే, తెలుగు అర్థమవుతుంది. కానీ, మాట్లాడలేను. భవిష్యత్తులో డబ్బింగ్ చెప్పే స్థాయిలో తెలుగు నేర్చేసుకుంటా’’ అని ఇషా తల్వార్ చెప్పారు. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ఉత్తరాది భామ నటించిన మలి చిత్రం ‘మైనే ప్యార్ కియా’ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇషా తల్వార్ మాట్లాడుతూ -‘‘దాదాపు ఏడాది తర్వాత తెలుగు తెరపై కనిపించబోతున్నా. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, ఆ సినిమాతో వచ్చిన పేరు నిలబెట్టుకోవాలంటే మళ్లీ మంచి సినిమానే చేయాలనుకున్నా. ‘మైనే ప్యార్ కియా’ నా పేరుని రెట్టింపు చేస్తుంది’’ అని చెప్పారు. -
మైనే ప్యార్ కియా మూవీ స్టిల్స్
-
ప్రేమలో మార్పులు
ఈ పదిహేనేళ్లలో ప్రేమలో వచ్చిన మార్పే ప్రధానాంశంగా తెరకెక్కిన చిత్రం ‘మైనే ప్యార్ కియా’. ప్రదీప్ బెట్నో, ఇషా తల్వార్, మధుమతి ఇందులో ప్రధాన పాత్రధారులు. ప్రదీప్ మాడుగుల దర్శకుడు. సానా వెంకట్రావ్, ఉపేంద్రకుమార్ గిరడ నిర్మాతలు. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల అవుతున్న సందర్భంగా, ప్రదీప్‌కుమార్.వి స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. మధుర శ్రీధర్, బి.ఎ.రాజు చిత్ర యూనిట్ సభ్యులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. సినిమా విజయం సాధించాలని అతిథులు, యూనిట్ సభ్యులు ఆకాంక్షించారు. -
మైనే ప్యార్ కియా మూవీ ప్లాటీనమ్
-
టైటిల్ ఒకటే కానీ...కథ వేరు!
‘‘ ‘మైనే ప్యార్ కియా’ అనగానే ఒకప్పటి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రమే గుర్తుకొస్తుంది. ఆ టైటిల్ పెట్టాం కానీ, ఆ కథకూ దీనికీ ఎటువంటి సంబంధం లేదు. ఆధునిక తరం ప్రేమను వినోదాత్మకంగా ఇందులో ఆవిష్కరిస్తున్నాం’’ అని దర్శకుడు ప్రదీప్ మాడుగుల చెప్పారు. ప్రదీప్, ఇషా తల్వార్ జంటగా ప్రదీప్ మాడుగుల దర్శకత్వంలో సానా వెంకటరావు, ఉపేంద్ర కుమార్ గిరడ నిర్మించిన ‘మైనే ప్యార్ కియా’ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ప్రతి సీనూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రదీప్‌కుమార్, కెమెరా: విశ్వా. -
మైనే ప్యార్ కీయా మూవీ ఆడియో లాంచ్
-
మైనే ప్యార్ కియా మూవీ స్టిల్స్ మరియు పోస్టర్స్
-
మైనే ప్యార్‌కియాకు సంబంధం లేదు
ప్రదీప్, ఇషా తల్వార్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘మైనే ప్యార్‌కియా’. ప్రదీప్ మాడుగల దర్శకుడు. సానా వెంకటరావు, ఉపేంద్రకుమార్ నిర్మాతలు. అమెరికాలో జరిగిన తెలుగు సంఘం(తానా) ఈవెంట్స్‌లో ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేశారు. మిస్ అమెరికా నీనా దావులూరి ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. ‘‘పూర్తి స్థాయి వినోదంతో సాగే సరికొత్త ప్రేమకథ ఇది. హిందీ ‘మైనే ప్యార్‌కియా’కి, ఈ సినిమాకు ఏ సంబంధం ఉండదు. ఇండియా, బ్యాంకాక్‌లో చిత్రీకరణ జరుపుతున్నాం. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. పోసాని కృష్ణమురళి, కోమల్ ఝా, ఉత్తేజ్, మధుమిత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రదీప్‌కుమార్ వి., కెమెరా: ఎస్వీ విశ్వ. -
మైనే ప్యార్ కీయా మూవీ స్టిల్స్
-
యువతరం మనస్తత్వంతో...
సాఫ్ట్వేర్ నేపథ్యంలో సాగే ప్రేమకథతో ప్రదీప్ మాడుగుల దర్శకత్వంలో సాన వెంకట్రావ్, ఉపేంద్రకుమార్ గిరిడ నిర్మిస్తున్న చిత్రం ‘మైనే ప్యార్ కియా’. ప్రదీప్ బెట్నో, ఇషా తల్వార్, కోమల్ ఝా ముఖ్య తారలు. పాటలు మినహా సినిమా పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఉపేంద్రకుమార్ మాట్లాడుతూ -‘‘పాటలను విదేశాల్లో చిత్రీకరించాలనుకుంటున్నాం. మంచి పాటలకు స్కోప్ ఉన్న కథ. ప్రదీప్‌కుమార్ స్వరపరచిన బాణీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. యువతరం మనస్తత్వాన్ని తెలియజేసే చిత్రం ఇదని దర్శకుడు తెలిపారు. -
మైనే ప్యార్ కియా
ప్రదీప్ బెట్నో, ఇషా తల్వార్, కోమల్ ఝా ముఖ్య తారలుగా ఉపేంద్రకుమార్ గిరడ, సానా వెంకట్రావు నిర్మిస్తున్న ‘మైనే ప్యార్ కియా’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రదీప్ మాడుగుల దర్శకుడు. నాయకా నాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి శ్రీను వైట్ల క్లాప్ ఇచ్చారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ -‘‘సల్మాన్‌ఖాన్, భాగ్యశ్రీ జంటగా నటించిన హిందీ చిత్రం ‘మైనే ప్యార్ కియా’కీ దీనికీ సంబంధం లేదు. ఫ్రెష్ సబ్జెక్ట్‌తో ఈ చిత్రం చేస్తున్నాం. వినోద ప్రధానంగా సాగే చిత్రం ఇది’’ అన్నారు. ప్రేక్షకుల అభిరుచిన దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేస్తున్నామని, 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తామని నిర్మాతలు చెప్పారు. -
మమ్ముట్టికి తల్లిగా మీనా?
మీనా వయసు నలభై లోపే. మమ్ముట్టికి అరవయ్యేళ్లు దాటి ఓ ఏడాది అయ్యింది. తనకన్నా వయసులో చాలా పెద్దవాడైన మమ్ముట్టికి తల్లిగా నటించడానికి మీనా అంగీకరించారని సమాచారం. వయసుకు తగ్గ పాత్రలు చేయడం సులువు కానీ ఇలా వయసుకు మించిన పాత్రలు మోయడం బరువే. ఈ పాత్రను మీనా ఓ సవాల్‌గా తీసుకున్నారట. ‘బాల్యకాల సఖి’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో మమ్ముట్టి సరసన ఇషా తల్వార్ కథానాయికగా నటిస్తున్నారు. మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన మీనాకు అక్కడ మంచి గుర్తింపు ఉంది. దాదాపు మూడు, నాలుగేళ్ల తర్వాత మలయాళంలో ఆమె నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా కాకుండా మోహన్‌లాల్ భార్యగా ఓ చిత్రంలో నటిస్తున్నారు మీనా. ఇక, ఇటీవల విడుదలైన ‘శ్రీ జగద్గురు ఆదిశంకర’లో ఆమె ఓ పాత్ర చేసిన విషయం తెలిసిందే. విద్యాసాగర్‌ని పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకు తల్లయిన తర్వాత మీనా రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నారు కాబట్టి కెరీర్‌ని సీరియస్‌గా తీసుకుంటున్నారని ఊహించవచ్చు.