మైనే ప్యార్‌కియాకు సంబంధం లేదు | Maine Pyar Kiya to Not associated | Sakshi
Sakshi News home page

మైనే ప్యార్‌కియాకు సంబంధం లేదు

Published Sun, Mar 16 2014 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM

మైనే ప్యార్‌కియాకు సంబంధం లేదు

మైనే ప్యార్‌కియాకు సంబంధం లేదు

ప్రదీప్, ఇషా తల్వార్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘మైనే ప్యార్‌కియా’. ప్రదీప్ మాడుగల దర్శకుడు. సానా వెంకటరావు, ఉపేంద్రకుమార్ నిర్మాతలు. అమెరికాలో జరిగిన తెలుగు సంఘం(తానా) ఈవెంట్స్‌లో ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేశారు. మిస్ అమెరికా నీనా దావులూరి ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. ‘‘పూర్తి స్థాయి వినోదంతో సాగే సరికొత్త ప్రేమకథ ఇది. హిందీ ‘మైనే ప్యార్‌కియా’కి, ఈ సినిమాకు ఏ సంబంధం ఉండదు. ఇండియా, బ్యాంకాక్‌లో చిత్రీకరణ జరుపుతున్నాం. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. పోసాని కృష్ణమురళి, కోమల్ ఝా, ఉత్తేజ్, మధుమిత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రదీప్‌కుమార్ వి., కెమెరా: ఎస్వీ విశ్వ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement