Maine Pyar Kiya
-
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!
బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రేమలేఖ వైరల్ అవుతోంది. అవును మీరు విన్నది నిజమే. 'నేను ప్రేమిస్తున్నాను. మీరు నన్ను ప్రేమిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాను' అని సల్మాన్ చేతిరాతతో రాసిన లెటర్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారిపోయింది. అసలు ఇంతకీ ఈ లేఖ ఎవరికీ రాశారు? దీని సంగతేంటి?(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)హీరో సల్మాన్ ఖాన్.. దాదాపు మూడు-నాలుగు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. అప్పట్లో 'ప్రేమ పావురాలు' లాంటి డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచాడు. ఇప్పుడు మాత్రం కేవలం హిందీ చిత్రాలే చేస్తున్నాడు. అయితే గత కొన్నిరోజుల నుంచి సల్మాన్ వార్తల్లో నిలుస్తున్నాడు. సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులు జరగడం అనేది షాకింగ్‌గా అనిపించింది.సరే ఇదంతా పక్కనబెడితే 'మైనే ప్యార్ కియా'(ప్రేమ పావురాలు) సినిమా రిలీజ్ తర్వాత.. తన చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకుల కోసం సల్మాన్ స్వయంగా ఓ లేఖ రాశాడు. ఇప్పుడదే మళ్లీ వైరల్ అవుతోంది. ఇందులో ఏముందంటే.. 'నన్ను అంగీకరించినందుకు, ప్రేమించినందుకు థ్యాంక్స్. ఇక నుంచి ఏ సినిమా చేసినా 'మైనే ప్యార్ కియా'తో పోలుస్తారని తెలుసు. కాబట్టి మంచి సినిమా చేయాలనే నా ప్రయత్నం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను-మీరు నన్ను ప్రేమిస్తూనే ఉంటారని ఆశిస్తున్నా. ఎందుకంటే మీరు నన్ను ప్రేమించడం మానేసిన రోజు.. నేను సినిమాలు చేయడం ఆపేస్తాను. అది నా కెరీర్‌కి ముగింపు అవుతుంది' అని సల్మాన్ రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?) -
రాధే శ్యామ్ లో ప్రభాస్ తల్లి.. ప్రేమ పావురాలు భాగ్యశ్రీ ఇంటర్వ్యూ
-
ప్రభాస్ సినిమాలో 'మైనే ప్యార్ కియా' నటి
భాగ్యశ్రీ.. ఈ పేరు ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా తెలియక పోయినా.. సల్మాన్ నటించిన మైనే ప్యార్ కియా సినిమా చూసిన వాళ్లకు మాత్రం తప్పకుండా గుర్తుంటుంది. మైనే ప్యార్ కియాలో హీరోయిన్గా నటించి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు భాగ్యశ్రీ. నటించిన మొదటి సినిమానే భాగ్య శ్రీకి స్టార్‌డమ్‌ను తీసుకొచ్చింది. ఆ తర్వాత అనేక సినిమాలు కొన్ని సీరియళ్లలో కూడా ఆమె నటించారు. అయితే కొన్ని సినిమాలతో ఆమెకు సరైన గుర్తింపు రాకపోవడంతో కొంత కాలంగా భాగ్యశ్రీ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 51 ఏళ్ల ఈ నటి మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించేందుకు సిద్ధం అవుతున్నారు. (బుల్లితెర ప్రేక్షకులకు శుభవార్త..! ) ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో భాగ్యశ్రీ ఈ వివరాలు వెల్లడించారు. లాక్‌డౌన్‌కు ప్రకటించకముందే సినిమా షూటింగ్‌లు పాల్గొన్నట్లు తెలిపారు. రెండు మూడు సినిమా స్క్రిప్ట్‌లు వింటున్నట్లు, ఇప్పటికే సినిమాల్లో నటించడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. వాటిలో ఒకటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేస్తున్నట్లు ఈ నటి తెలిపారు. అయితే ఏ సినిమా అనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. ప్రభాస్ సినిమాలో ఆసక్తికర పాత్ర పోషిస్తున్నట్లు, ఇందుకు నటనలో కొంత శిక్షణ తీసుకోవాల్సి ఉందన్నారు. (అది తల్చుకుంటేనే వణికిపోతున్నాను: నటి) ప్రభాస్‌తో నటిస్తున్నట్లు భాగ్య శ్రీ చెప్పడంతో ఏ పాత్రలో నటిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రభాస్‌కు తల్లిగా ఆమె నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మైనే ప్యార్ కియాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన భాగ్య శ్రీ.. సల్మాన్ ఖాన్, చిత్ర దర్శకుడు సూరజ్ బర్జాత్యా సమక్షంలో హిమాలయ దసాని అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి అభిమన్యు దస్సాని అనే కుమారుడు, అవంతిక దాసాని అనే కుమార్తెకు ఉన్నారు. (ప్రేయసిని పెళ్లాడిన హీరో నిఖిల్ ) -
‘ఆ సినిమా నేను చేయాల్సింది.. కానీ..’
‘ఆరోజు ఎందుకో సూరజ్ కాల్‌కు సరిగా స్పందించలేకపోయాను. అందుకే బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నాను’ అని నటుడు పీయూష్ మిశ్రా పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. శుక్రవారం జరిగిన సాహిత్య ఆజ్ తక్ 2018 కార్యక్రమంలో పాల్గొన్న పీయూష్ మాట్లాడుతూ... తాను ‘మై నే ప్యార్ కియా’ సినిమాను వదులుకోవడం వెనుక ఉన్న కారణాలను చెప్పుకొచ్చాడు. ‘అసలు ఆ సినిమా ఎందుకు ఒప్పుకోలేదు నాకింకా అర్థం కావడం లేదు. సూరజ్ బర్జాత్యా నాకు ఆరోజు ఫోన్ చేశాడు. హీరోయిన్గా భాగ్యశ్రీని ఎంపిక చేశానని చెప్పాడు. ఈ సినిమాతో ఇండస్ట్రీకి నిన్ను పరిచయం చేయాలనుకుంటున్నాను.. నీ అభిప్రాయం ఏమిటి? హీరో క్యారెక్టర్ చేసేందుకు సిద్ధమేనా అని అడిగాడు. కానీ నేను సరైన సమాధానం ఇవ్వలేకపోయాను. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా కేవలం థియేటర్ ఆర్టిస్టుగా ఉండిపోవడానికి సిద్ధపడి ఈ నిర్ణయం తీసుకోలేదు’ అని వ్యాఖ్యానించాడు. (మానవజాతి ఉన్నంత వరకు ఈ కథ ఉంటుంది!!) కాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తొలి సినిమా ‘మై నే ప్యార్ కియా’ ఏ రేంజ్లో హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 28 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడమే కాకుండా.. ఆ దశాబ్దంలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ప్రేమకథాచిత్రంతోనే చాక్లెట్ బాయ్ ఇమేజ్‌తో ‘ప్రేమ్’గా అమ్మాయిల గుండెల్లో సల్మాన్ చెరగని ముద్ర వేశాడు. అంతేకాకుండా రాత్రికే రాత్రి స్టార్‌గా మారిపోయి ఇప్పటికీ తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. బహుషా ఇదంతా చూసిన తర్వాత తాను ఈ సినిమాను ఎందుకు వదులుకున్నానా పీయూష్ బాధ పడుతున్నాడేమో పాపం. కానీ ఎవరికి దక్కాల్సిన అవకాశాలు వారికే దక్కుతాయి కదా! పీయూష్ మిశ్రా -
తొలిప్రేమ రెపరెపలు
సీసాలో బంధించలేని భూతం ఒకటి ఉంది– ప్రేమ. పది దాటి, పదకొండు దాటి, పన్నెండు దాటి, పదమూడు తగిలాక, పద్నాలుగు నిండాక, పదిహేను పండాక, పదహారు పలకరించాక ఈ భూతం పట్టుకుంటుంది. ఎప్పుడు ప్రత్యక్షమవుతుందో... ఎవరికి ప్రత్యక్షం చేయిస్తుందో.సకల లోకం ఈ కథను వినడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఒకమ్మాయి.. ఒకబ్బాయి... వాళ్లిద్దరూ కలిశారు. తర్వాత ఏమైంది.అందరికీ ఇదే ఇంట్రెస్ట్.మానవజాతి ఉన్నంత వరకు ఈ కథ ఉంటుంది. ‘ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించింది నిజమైతే, ఆ అబ్బాయి మీద నీ ప్రేమ అంత స్వచ్ఛమైనదే అయితే ఇద్దరూ ఒక సంవత్సరం పాటు ఒకరినొకరు చూసుకోకుండా దూరంగా ఉండాలి’ అని గతంలో కె.బాలచందర్ ‘మరో చరిత్ర’లో ఒక చిత్రమైన ప్రేమ పందేన్ని చూపిస్తారు. ‘ప్రేమ పావురాల్లో’ కూడా ఒక ప్రేమ పందెం ఉంది. ‘నువ్వు నా కూతురిని ప్రేమించింది నిజమే అయితే నీ ప్రేమ స్వచ్ఛమైనదే అయితే ఒక నెలలో రెండు వేల రూపాయలు సంపాదించి చూపించు’ అంటాడు అమ్మాయి తండ్రి.అబ్బాయి సరేనంటాడు. అది ఇవాళ కాదు. 1989లో.రెండు వేల రూపాయలంటే గెజిటెడ్ ఆఫీసర్‌కు కూడా అంత నెల జీతం లేదు. కొండ ప్రాంతంలో రాళ్లు కొట్టే పని తప్ప వేరే ఏమీ లేని చోట నెలకు రెండు వేల రూపాయల కష్టార్జితం చూపించి తన ప్రేమను గెలుచుకోవాలనుకుంటాడు అబ్బాయి. ఆ పని ఎలా చేస్తాడో చూద్దామని ప్రేక్షకులకు కుతూహలం కలిగింది.ఆ కుతూహలం సక్రమంగా తీరే సరికి సినిమా సూపర్ హిట్ అయ్యింది. 2 కోట్లతో సినిమా తీస్తే 28 కోట్లు వచ్చాయి.ఇవాళ్టి డబ్బుతో సమానం చేస్తే దాదాపు 450 కోట్లు.గ్రాఫిక్సు గుర్రాలు ఏళ్ల తరబడి మేకింగ్ లేకుండా ఆరు నెలల్లో తీసి కథతో సాధించిన ప్రేమ బాహుబలి రికార్డు అది. ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డు. సాధారణంగా హీరోయిన్ రాజకుమారి అయి ఉంటుంది. హీరో పేదవాడు అయి ఉంటాడు. కాని ఈ సినిమాలో రివర్స్. హీరో రాజకుమారుడు. హీరోయిన్ మామూలు అమ్మాయి. కాని ఆత్మాభిమానం కలిగినది. తండ్రి దుబాయ్ వెళుతూ వెళుతూ ఆమెను స్నేహితుడి ఇంట్లో వదిలి పెడితే ఆ స్నేహితుని కుమారుడి మనసు గెలుచుకుంటుంది. చక్కటి రూపం, మాట తీరు, సంస్కారం... ఇవన్నీ ఉన్న అమ్మాయిని ఎవరు వదలుకుంటారు? కాని ఇందులో తండ్రీ కూతుళ్ల కుట్ర ఉందని అబ్బాయి తండ్రి అనుమానిస్తాడు. ఆ మాటే చెప్పి స్నేహితుడని కూడా చూడకుండా అమ్మాయి తండ్రిని గాయపరుస్తాడు. కూటికి పేద కావచ్చు కాని ఆత్మగౌరవానికి కాదు. నీ దగ్గర డబ్బుంటే వెయ్యి సార్లు తిను వందసార్లు ఊరేగు... కాని డబ్బుంది కదా అని అవమానించకు అని అతడు తన కూతురిని తీసుకుని ఊరికి వచ్చేస్తాడు. వెతుక్కుంటూ వచ్చిన అబ్బాయిని ‘నీ తండ్రి సంపాదన లేకపోతే నువ్వు నిండు సున్నాతో సమానం’ అని రెచ్చ గొడతాడు. నెలకు రెండు వేలు సంపాదించి చూపించు అని సవాలు విసురుతాడు. ప్రేమ కోసం మనసు పడిన పసివాడు రాచరికాన్ని వదిలి కూలివాడిగా మారతాడు. రాళ్లు కొడతాడు. నీళ్లల్లో తడుస్తాడు. చివరకు తన ప్రేమ సాధించుకుంటాడు. గెలిచిన ప్రేమకు ఎప్పుడు ప్రజల హర్షం ఉంటుంది. ఆ హర్షం కలెక్షన్ల రూపంలో వచ్చింది. కథ పెద్దగా ఏమీ లేకుండా కథా సంవిధానంతో కథ నడపడం ఈ సినిమాతో మొదలైంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు పలకరించుకోవడమే. అదీ చాలా కొత్త సీన్లతో. ఫ్రెష్ సీన్లతో. అబ్బాయి అమెరికా నుంచి హడావుడిగా వచ్చి బాత్రూమ్లో ‘సుసూ’ చేస్తూ చాలా క్యాజువల్‌గా హీరోయిన్ని పలకరిస్తాడు. హీరోయిన్ కూడా ఉలిక్కిపడి పలకరిస్తుంది. ఇలాంటి సీన్ ఇంతకు మునుపు లేదు. హీరోయిన్ను హీరో పార్టీకి తీసుకువెళతాడు. అక్కడ హీరోయిన్‌కు అవమానం జరుగుతుంది. హీరో ప్రతాపం చూపి ‘నువ్వు నా దానివి’ అనే సూచన చేస్తాడు. ఇదీ కొత్త సీనే. అబ్బాయి ‘ఐ లవ్ యూ’ చెప్పాక అమ్మాయికి ‘ఐ లవ్ యూ’ చెప్పే వీలు ఉండదు. అది చూసి అబ్బాయి అలుగుతాడు. ఆ అలక చూసి ఏమైతే అదవుతుందని అందరి ముందే ఐ లవ్ యూ చెప్పడానికి అమ్మాయి ముందుకు వస్తుంది. ‘అంత్యాక్షరి’ ఆడుతూ పాట రూపంలో తన మనసులో మాట చెబుతుంది. ఇది కూడా చాలా కొత్త సీను. వీళ్లకు మీడియేటర్‌గా పావురం ఉండటం కొత్త. అప్పటి దాకా అమ్మలంటే మిషన్ కుడుతూ, లేదంటే కన్నీరు కారుస్తూ, ముసలి విగ్గులతో కనిపించేది. ఈ సినిమాలో హీరో తల్లి చాలా ఫ్రెండ్లీగా ఉండి ఎంతో క్యాజువల్‌గా కనిపించి నేడు ప్రతి సినిమాలో కనిపిస్తున్న ఆ తరహా తల్లుల పాత్రకు రోల్ మోడల్ అయ్యింది. ఈ పాత్రా కొత్తే. హీరో కొత్త. హీరోయిన్ కొత్త. దర్శకుడు కొత్త. కాని ప్రేమ మాత్రం కొన్ని యుగాలంత పాత. అందుకే ‘ప్రేమ పావురాలు’ కొన్ని దశాబ్దాలు చెప్పుకునేంత పెద్ద హిట్ అయ్యింది. ముత్యపుచిప్పలు తీరమంతా పడి ఉంటాయి. అందరూ ఏరుతారు. కాని ఏ ఒక్కరికో లోపల ముత్యం దొరుకుతుంది. ప్రేమ కూడా అంతే. ఎందరో అనుకుంటారు. కాని కొందరే పొందుతారు. పెళ్లి తర్వాత ప్రేమ బాగుంటుంది అని ఎవరైనా అనొచ్చు గాక... కాని పెళ్లికి ముందు ప్రేమ, కనుల పలకరింత, దివారాత్రాల పలవరింత, మొదటిసారి చెప్పుకున్న ఐ లవ్ యూ మాటలు, రాసుకున్న లేఖలు, ప్రేమను ఫలవంతం చేసుకుంటూ పెళ్లి దాకా నడిచిన నడక... ఇవి పొందినవారు ధన్యులు. సాదాగా నడిచిపోయిన ప్రేమ సాదా దోసె తిన్నట్టుంటుంది. ఈ కథలోలాగా సవాలు ఎదురైతే అది కట్ మిర్చి. చాలా కాలం వదలని మధురమైన మిర్చీ ఘాటు– ప్రేమ పావురాలు. మై నే ప్యార్ కియా దర్శకుడు సూరజ్ భరజాత్యా పాతికేళ్ల వయసులో తీసిన ‘మైనే ప్యార్ కియా’ అతణ్ణి, అతడు పరిచయం చేసిన సల్మాన్‌ఖాన్‌ని జీవితకాలం పాటు సెటిల్ చేసింది. అదే సినిమాతో పెద్ద స్టారైన హీరోయిన్ భాగ్యశ్రీ వెంటనే సినిమాల నుంచి తప్పుకుని ఆ కాలపు కుర్రకారుకి తియ్యని కలగా మిగిలింది. ‘మైనే ప్యార్ కియా’ తెలుగులో ‘ప్రేమ పావురాలు’గా విడుదలై పాతిక వారాలు ఆడటం ఒక ఘనత. ఇందులోని పాటలు చాలా పెద్ద హిట్టు. ‘దిల్ దీవానా బిన్ సజ్నాకే’, ‘కబూతర్ జా జా జా’, ‘ఆజా షామ్ హోనే ఆయీ’.. ఇవి హిందీతో పాటు తెలుగులో కూడా హిట్టయ్యాయి. రాజశ్రీ రచన, రామ్‌లక్ష్మణ్ సంగీతం, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గానం మరువం. ఈ సినిమా సెంటిమెంట్‌తో బాలూ కొంత కాలం పాటు సల్మాన్‌ఖాన్ గళంగా మారారు. ఈ సినిమా ఆధారంగా కృష్ణవంశీ ‘నిన్నే పెళ్లాడతా’ తీశారు. స్నేహితుడి ఇంట్లో అమ్మాయికి బదులు అబ్బాయిని వదలిపెట్టి త్రివిక్రమ్ ‘నువ్వు నాకు నచ్చావ్’ రాశారు. దీనినే యథాతథంగా ‘నువ్వు వస్తానంటే నేను వద్దంటానా’గా తీశారు. ఇంకా పదుల కొద్దీ సినిమాలు దీని ఆధారంగా వచ్చాయి. – కె -
మైనేప్యార్కియా కు పాతికేళ్లు!
-
'మైనే ప్యార్ కియా' టీంతో చిట్ చాట్
-
ఆటో రైడ్ ని నిర్వహించిన 'మైనే ప్యార్ కియా' టీమ్
-
సినిమా రివ్యూ: 'మైనే ప్యార్ కియా'
ఒకప్పడు హిందీలో 'మైనే ప్యార్ కియా' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దర్శకుడు ప్రదీప్ మాడుగుల 'మైనే ప్యార్ కియా' చిత్ర టైటిల్ తో రూపొందించిన చిత్రం జూన్ 20 తేదిన విడుదలైంది. 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్ర 'ఫేం' ఇషా తల్వార్, ప్రదీప్ బెంటో నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకుందా అనే విషయాని తెలుసుకోవాలంటే కథంటే తెలుసుకోవాల్సిందే. ఇషా తల్వార్, ప్రదీప్ లు చిన్న నాటి స్నేహితులు. చిన్నతనంలో ఎప్పడూ గొడవ పడుతుంటారు...వారు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగులుగా చేరుతారు. వారం రోజుల్లో నిశ్చితార్ధం జరిగే ఇషాను చూసి మనసు పడుతాడు. తన ప్రేమను ఇషాకు తెలియ చేస్తాడు. ప్రదీప్ ను ఇష్టపడుతున్నానని తెలుసుకున్న ఇషా తన మనసులోని మాటా చెప్పలానుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ కు ముందు ఓ కారణంగా ప్రదీప్ అంటే ఇషాకు అసహ్యం ఏర్పడుతుంది. ప్రదీప్ ను అసహ్యించుకోవడానికి కారణమేమిటి? ప్రదీప్, ఇషాల మధ్య నెలకొన్న మనస్పర్ధలు ఎలా తొలగించుకున్నారు అనే ప్రశ్నలకు సమాధానమే 'మైనే ప్యార్ కియా'. నవీన్ గా ప్రదీప్, శాలినిగా ఇషా తల్వార్ లు నటించారు. గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన ఇషా తల్వార్ మరోసారి మైనే ప్యార్ కియాతో ఆకట్టుకున్నారు. గ్లామర్ నే కాకుండా అభినయంతో కూడా పర్వాలేదనిపించింది. కొన్ని సన్నివేశాల్లో ప్రదీప్ యాక్టింగ్ బాగుంది. అయితే వీరిద్దరీ ఫెర్ఫార్మెన్స్ 'మైనే ప్యార్ కియా'ను విజయం దిశగా నడిపిస్తారా అంటే సమాధానం కష్టమే. ప్రదీప్ స్నేహితుడిగా వేణు పర్వాలేనిపించారు. స్వలింగ సంపర్కుడిగా నటించిన పోసాని కృష్ణమురళి మెప్పించలేకపోయారు. సత్యదేవ్, స్వప్నమాధురిల పాత్రలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. కొంతలో కొంత సత్యదేవ్, స్వప్న మాధురిలు సెకండాఫ్ లో కొంత ఇంట్రెస్ క్రియేట్ చేసినా సినిమాకు పాజిటివ్ గా మలచలేకపోయారు. సాదాసీదా కథకు ఫోటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కొంత మెరుగులు దిద్దారు. క్వాలిటీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సంతోష్ నారాయణ్ ఆలరించారు. ఫోటోగ్రఫి చాలా రిచ్ గా ఉంది. మాస్ డైలాగ్స్ తో కొంత ఆకట్టుకునే ప్రయత్నం జరిగింది. సింపుల్ కథతో 'మైనే ప్యార్ కియా' అందించిన ప్రదీప్ మాడుగుల కథనంపై సరైన దృష్టిని పెట్టాలేదనే అభిప్రాయం కలుగుతుంది. కథనం పేలవంగా ఉండటంతో సినిమాపై పట్టు సడలిందనే భావన కలుగుతుంది. అటు మల్టీ ప్లెక్స్ ఆడియెన్స్ కు, బీసీ ప్రేక్షకుల అభిరుచి దూరంగా ఉన్న 'మైనే ప్యార్ కియా'కు సక్సెస్ ను సొంత చేసుకుంటుందా అని చెప్పడం కష్టమే. -
ఏడాది తర్వాత... వస్తున్నా!
‘‘సంస్కృతానికి దగ్గరగా ఉంటుంది తెలుగు. అందుకే, తెలుగు అర్థమవుతుంది. కానీ, మాట్లాడలేను. భవిష్యత్తులో డబ్బింగ్ చెప్పే స్థాయిలో తెలుగు నేర్చేసుకుంటా’’ అని ఇషా తల్వార్ చెప్పారు. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ఉత్తరాది భామ నటించిన మలి చిత్రం ‘మైనే ప్యార్ కియా’ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇషా తల్వార్ మాట్లాడుతూ -‘‘దాదాపు ఏడాది తర్వాత తెలుగు తెరపై కనిపించబోతున్నా. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, ఆ సినిమాతో వచ్చిన పేరు నిలబెట్టుకోవాలంటే మళ్లీ మంచి సినిమానే చేయాలనుకున్నా. ‘మైనే ప్యార్ కియా’ నా పేరుని రెట్టింపు చేస్తుంది’’ అని చెప్పారు. -
మైనే ప్యార్ కియా మూవీ స్టిల్స్
-
ప్రేమలో మార్పులు
ఈ పదిహేనేళ్లలో ప్రేమలో వచ్చిన మార్పే ప్రధానాంశంగా తెరకెక్కిన చిత్రం ‘మైనే ప్యార్ కియా’. ప్రదీప్ బెట్నో, ఇషా తల్వార్, మధుమతి ఇందులో ప్రధాన పాత్రధారులు. ప్రదీప్ మాడుగుల దర్శకుడు. సానా వెంకట్రావ్, ఉపేంద్రకుమార్ గిరడ నిర్మాతలు. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల అవుతున్న సందర్భంగా, ప్రదీప్‌కుమార్.వి స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. మధుర శ్రీధర్, బి.ఎ.రాజు చిత్ర యూనిట్ సభ్యులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. సినిమా విజయం సాధించాలని అతిథులు, యూనిట్ సభ్యులు ఆకాంక్షించారు. -
మైనే ప్యార్ కియా మూవీ ప్లాటీనమ్
-
టైటిల్ ఒకటే కానీ...కథ వేరు!
‘‘ ‘మైనే ప్యార్ కియా’ అనగానే ఒకప్పటి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రమే గుర్తుకొస్తుంది. ఆ టైటిల్ పెట్టాం కానీ, ఆ కథకూ దీనికీ ఎటువంటి సంబంధం లేదు. ఆధునిక తరం ప్రేమను వినోదాత్మకంగా ఇందులో ఆవిష్కరిస్తున్నాం’’ అని దర్శకుడు ప్రదీప్ మాడుగుల చెప్పారు. ప్రదీప్, ఇషా తల్వార్ జంటగా ప్రదీప్ మాడుగుల దర్శకత్వంలో సానా వెంకటరావు, ఉపేంద్ర కుమార్ గిరడ నిర్మించిన ‘మైనే ప్యార్ కియా’ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ప్రతి సీనూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రదీప్‌కుమార్, కెమెరా: విశ్వా. -
సాఫ్ట్వేర్ ప్యార్
ప్రదీప్ బెట్నో, ఇషా తల్వార్ జంటగా రూపొందిన చిత్రం ‘మైనే ప్యార్ కియా’. ప్రదీప్ దర్శకుడు. సాన వెంకట్రావు, ఉపేంద్రకుమార్ గిరిడ నిర్మాతలు. వి.ప్రదీప్‌కుమార్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని సంపత్‌నంది ఆవిష్కరించి, మధుర శ్రీధర్‌కి అందించారు. టైటిల్ లోగోను ఎన్వీ ప్రసాద్, ప్రచార చిత్రాలను సురేశ్ కొండేటి, శివబాలాజీ ఆవిష్కరించారు. వీరితోపాటు అతిథులుగా పాల్గొన్న వీరభద్రం చౌదరి, మల్టీ డైమన్షన్ వాసు సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘సాఫ్ట్వేర్ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. సల్మాన్ ‘మైనే ప్యార్‌కియా’లాగే... ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుంది. సమ్మర్లో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబి చౌదరి. -
మైనే ప్యార్ కీయా మూవీ ఆడియో లాంచ్
-
మైనే ప్యార్ కియా మూవీ స్టిల్స్ మరియు పోస్టర్స్
-
మైనే ప్యార్‌కియాకు సంబంధం లేదు
ప్రదీప్, ఇషా తల్వార్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘మైనే ప్యార్‌కియా’. ప్రదీప్ మాడుగల దర్శకుడు. సానా వెంకటరావు, ఉపేంద్రకుమార్ నిర్మాతలు. అమెరికాలో జరిగిన తెలుగు సంఘం(తానా) ఈవెంట్స్‌లో ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేశారు. మిస్ అమెరికా నీనా దావులూరి ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. ‘‘పూర్తి స్థాయి వినోదంతో సాగే సరికొత్త ప్రేమకథ ఇది. హిందీ ‘మైనే ప్యార్‌కియా’కి, ఈ సినిమాకు ఏ సంబంధం ఉండదు. ఇండియా, బ్యాంకాక్‌లో చిత్రీకరణ జరుపుతున్నాం. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. పోసాని కృష్ణమురళి, కోమల్ ఝా, ఉత్తేజ్, మధుమిత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రదీప్‌కుమార్ వి., కెమెరా: ఎస్వీ విశ్వ. -
మైనే ప్యార్ కీయా మూవీ స్టిల్స్
-
యువతరం మనస్తత్వంతో...
సాఫ్ట్వేర్ నేపథ్యంలో సాగే ప్రేమకథతో ప్రదీప్ మాడుగుల దర్శకత్వంలో సాన వెంకట్రావ్, ఉపేంద్రకుమార్ గిరిడ నిర్మిస్తున్న చిత్రం ‘మైనే ప్యార్ కియా’. ప్రదీప్ బెట్నో, ఇషా తల్వార్, కోమల్ ఝా ముఖ్య తారలు. పాటలు మినహా సినిమా పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఉపేంద్రకుమార్ మాట్లాడుతూ -‘‘పాటలను విదేశాల్లో చిత్రీకరించాలనుకుంటున్నాం. మంచి పాటలకు స్కోప్ ఉన్న కథ. ప్రదీప్‌కుమార్ స్వరపరచిన బాణీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. యువతరం మనస్తత్వాన్ని తెలియజేసే చిత్రం ఇదని దర్శకుడు తెలిపారు. -
మైనే ప్యార్ కియా
ప్రదీప్ బెట్నో, ఇషా తల్వార్, కోమల్ ఝా ముఖ్య తారలుగా ఉపేంద్రకుమార్ గిరడ, సానా వెంకట్రావు నిర్మిస్తున్న ‘మైనే ప్యార్ కియా’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రదీప్ మాడుగుల దర్శకుడు. నాయకా నాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి శ్రీను వైట్ల క్లాప్ ఇచ్చారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ -‘‘సల్మాన్‌ఖాన్, భాగ్యశ్రీ జంటగా నటించిన హిందీ చిత్రం ‘మైనే ప్యార్ కియా’కీ దీనికీ సంబంధం లేదు. ఫ్రెష్ సబ్జెక్ట్‌తో ఈ చిత్రం చేస్తున్నాం. వినోద ప్రధానంగా సాగే చిత్రం ఇది’’ అన్నారు. ప్రేక్షకుల అభిరుచిన దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేస్తున్నామని, 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తామని నిర్మాతలు చెప్పారు.