బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రేమలేఖ వైరల్ అవుతోంది. అవును మీరు విన్నది నిజమే. 'నేను ప్రేమిస్తున్నాను. మీరు నన్ను ప్రేమిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాను' అని సల్మాన్ చేతిరాతతో రాసిన లెటర్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారిపోయింది. అసలు ఇంతకీ ఈ లేఖ ఎవరికీ రాశారు? దీని సంగతేంటి?
(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)
హీరో సల్మాన్ ఖాన్.. దాదాపు మూడు-నాలుగు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. అప్పట్లో 'ప్రేమ పావురాలు' లాంటి డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచాడు. ఇప్పుడు మాత్రం కేవలం హిందీ చిత్రాలే చేస్తున్నాడు. అయితే గత కొన్నిరోజుల నుంచి సల్మాన్ వార్తల్లో నిలుస్తున్నాడు. సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులు జరగడం అనేది షాకింగ్‌గా అనిపించింది.
సరే ఇదంతా పక్కనబెడితే 'మైనే ప్యార్ కియా'(ప్రేమ పావురాలు) సినిమా రిలీజ్ తర్వాత.. తన చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకుల కోసం సల్మాన్ స్వయంగా ఓ లేఖ రాశాడు. ఇప్పుడదే మళ్లీ వైరల్ అవుతోంది. ఇందులో ఏముందంటే.. 'నన్ను అంగీకరించినందుకు, ప్రేమించినందుకు థ్యాంక్స్. ఇక నుంచి ఏ సినిమా చేసినా 'మైనే ప్యార్ కియా'తో పోలుస్తారని తెలుసు. కాబట్టి మంచి సినిమా చేయాలనే నా ప్రయత్నం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను-మీరు నన్ను ప్రేమిస్తూనే ఉంటారని ఆశిస్తున్నా. ఎందుకంటే మీరు నన్ను ప్రేమించడం మానేసిన రోజు.. నేను సినిమాలు చేయడం ఆపేస్తాను. అది నా కెరీర్‌కి ముగింపు అవుతుంది' అని సల్మాన్ రాసుకొచ్చాడు.
(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)
Comments
Please login to add a commentAdd a comment