సాఫ్ట్‌వేర్ ప్యార్
ప్రదీప్ బెట్నో, ఇషా తల్వార్ జంటగా రూపొందిన చిత్రం ‘మైనే ప్యార్ కియా’. ప్రదీప్ దర్శకుడు. సాన వెంకట్రావు, ఉపేంద్రకుమార్ గిరిడ నిర్మాతలు. వి.ప్రదీప్‌కుమార్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని సంపత్‌నంది ఆవిష్కరించి, మధుర శ్రీధర్‌కి అందించారు. టైటిల్ లోగోను ఎన్వీ ప్రసాద్, ప్రచార చిత్రాలను సురేశ్ కొండేటి, శివబాలాజీ ఆవిష్కరించారు.
వీరితోపాటు అతిథులుగా పాల్గొన్న వీరభద్రం చౌదరి, మల్టీ డైమన్షన్ వాసు సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘సాఫ్ట్‌వేర్ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. సల్మాన్ ‘మైనే ప్యార్‌కియా’లాగే... ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుంది. సమ్మర్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబి చౌదరి.