
తిరుమలాయపాలెం: అమెరికాలో బీటెక్ చదువుతున్న ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం విద్యార్థి కొండబాల పృథ్వీ (21) రేస్ బైక్‌పై వెళుతూ ప్రమాదవశాత్తూ లోయలో పడి మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. టీడీపీ తిరుమలాయపాలెం మండల అధ్యక్షుడు కొండబాల కరుణాకర్ ఏకైక కుమారుడు పృథ్వీ బీటెక్ కోసం రెండేళ్ల క్రితం యూఎస్‌లోని కొలంబస్ ఫ్రాక్లిన్ యూనివర్సిటీలో చేరాడు.
ప్రస్తుతం ఉన్నత చదువు కొనసాగిస్తూనే.. ఉద్యోగం చేస్తున్న ఇతను.. ఆదివారం రేస్ బైక్‌పై సరదాగా వెళుతూ.. వెనుక వస్తున్న స్నేహితులను చూసే క్రమంలో అదుపుతప్పి డివైడర్‌ని ఢీకొన్నాడు. పక్కనున్న లోయలో పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. రెండు, మూడు రోజుల్లో స్వదేశానికి అతడి మృతదేహాన్ని తీసుకొస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment