
పృథ్వీ, మైరా దోషి జంటగా నటించిన చిత్రం ‘ఐఐటి కృష్ణమూర్తి’. శ్రీవర్థన్ దర్శకత్వంలో ప్రసాద్ నేకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. పృథ్వీ మాట్లాడుతూ– ‘‘మంచి కాన్సెప్ట్‌తో, మిస్సింగ్ కథతో థ్రిల్లర్‌గా మా చిత్రం తెరకెక్కింది. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ‘ఐఐటి కృష్ణమూర్తి’ ట్రైలర్‌ను విడుదల చేసి, ప్రేక్షకులను అలరిస్తుందని అభినందనలు తెలిపారు’’ అన్నారు. మైరా దోషి మాట్లాడుతూ– ‘‘ఐఐటి కృష్ణమూర్తి’ నాకెంతో స్పెషల్ ఫిల్మ్. ఇందులో నేను చేసిన పాత్ర అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను’’ అన్నారు. శ్రీవర్థన్ మాట్లాడుతూ– ‘‘నన్ను నమ్మి నాతో ఈ ప్రాజెక్ట్ చేసిన నిర్మాతకు కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చే జానర్‌తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం తెరకెక్కించటం జరిగింది’’ అన్నారు. ‘‘సినిమా కాన్సెప్ట్ బావుంది. దర్శకుని కథ, కథనాల ఎంపిక నచ్చింది. టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్.