
దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘వి’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా నాని కెరీర్‌లో 25 వది కావడం విశేషం. బుధవారం ‘వి’ ట్రైలర్‌ని నాని ట్విటర్‌లో విడుదల చేశారు. అంచనాలకు తగ్గట్టుగా సినిమా ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. నాని, సుధీర్‌బాబు మధ్య యాక్షన్, ఛేజింగ్ సీన్స్ థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమా వయెలెంట్‌గా ఉండనుందని ట్రైలర్‌లో నాని డైలాగ్స్‌ని బట్టి అర్థమవుతోంది. నివేదా థామస్, అదితీ రావ్ హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘దిల్’రాజు, శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి సినిమాని నిర్మించారు. సినిమా సెప్టెంబరు 5న ఓటీటీలో (అమెజాన్ ప్రైమ్)లో ఈ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment