పృథ్వీ దండమూడి, మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఐఐటీ కృష్ణమూర్తి ’. శ్రీ వర్థన్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ప్రేమ్‌కుమార్ పాట్ర సమర్పణలో క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ పతాకంపై ప్రసాద్ నేకూరి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను నిర్మాత కె.ఎస్ రామారావు విడుదల చేశారు. డైరెక్టర్ రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘ఐఐటి కృష్ణమూర్తి’ టైటిల్ వెరైటీగా ఉంది. ఈ చిత్రం టీజర్ ఇంటెన్స్‌గా చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్. యూత్ అంతా కలిసి చేసిన ఈ సినిమా నిర్మాతకు సక్సెస్‌ను అందించాలి’’ అన్నారు. ‘‘కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. నేటి తరానికి నచ్చేలా ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఉంటుంది.
ప్రేక్షకులందరికీ మా ‘ఐఐటి కృష్ణమూర్తి’ నచ్చుతాడని నమ్ముతున్నా’’ అని శ్రీ వర్ధన్ అన్నారు. ‘‘నాకు సినిమా ఫీల్డ్ కొత్త. ఈ చిత్ర దర్శకుడు, రైటర్ పట్టుదల, కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నా. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో రూపొందుతోంది’’ అని ప్రసాద్ నేకూరి అన్నారు. ‘‘నేను హీరో అయినా, మా టీమ్ మెంబర్సే ఈ చిత్రానికి రియల్ హీరోస్’’ అని పృథ్వీ దండమూడి అన్నారు. చిత్ర సమర్పకులు ప్రేమ్‌కుమార్ పాత్ర, సంగీత దర్శకుడు నరేష్ కుమారన్, నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, సురేష్ కొండేటి, సాయి వెంకట్, రమేష్ మద్దినేని, బాబ్జీ, రామ్ రావిపల్లి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యేసు.పి, లైన్ ప్రొడ్యూసర్: ఎల్.వి. వాసుకి.
కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్
Published Wed, Feb 27 2019 12:27 AM | Last Updated on Wed, Feb 27 2019 12:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment