
బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ షూటింగ్‌లో గాయపడ్డాడు. సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించి స్పెషల్ ప్రోమో షూట్ చేసే క్రమంలో అతడికి గాయాలయ్యాయి. సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన చిత్రం అన్‌స్టాపబుల్. నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. రజిత్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం ఓ ప్రోమో షూట్ నిర్వహించింది.
ఇందులో పోలీస్ గెటప్‌లో ఉన్న సప్తగిరి అన్‌స్టాపబుల్ రిలీజ్ ఎప్పుడు? అని గన్ పట్టుకుని పృథ్వీరాజ్‌ను బెదిరించాడు. ఇంతలో అటువైపుగా సన్నీ రావడంతో పృథ్వీ అతడిపైకి గన్ ఎక్కుపెట్టాడు. పొరపాటున అది పేలడంతో సన్నీకి బుల్లెట్ తగిలింది. అది డమ్మీ బుల్లెట్ అయినప్పటికీ సన్నీకి గాయం కావడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే ఆ డమ్మీ గన్‌ను కావాలనే పేల్చారని, సన్నీకి ఏ గాయమూ కాలేదని, ఇదంతా మూవీ ప్రమోషన్ స్టంట్ అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా గతంలోనూ సన్నీ డబ్బులు దొంగతనం చేసిన వీడియో వైరల్ అయింది. ఏటీఎమ్ వెబ్ సిరీస్ కోసం అలా స్టంట్ చేశాడని ఇట్టే పసిగట్టారు ఆడియన్స్. ఇకపోతే గతంలో సీరియల్స్‌లో నటించిన సన్నీ బిగ్‌బాస్ షోతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అతడికి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.
షూటింగ్ లో బిగ్ బాస్ సన్నీకి ప్రమాదం
— yenugula somasekhar (@yenugulasomase1) May 12, 2023
బుల్లెట్ తగలడంతో ఆసుపత్రికి తరలింపు#vjsunny #UnstoppableEknath pic.twitter.com/CO3Vqtf3Kn
చదవండి: మోడ్రన్ లవ్ చెన్నై.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment