hero nandu
-
కదల్లేని స్థితిలో సింగర్ భర్త.. అయినా కూడా..!
టాలీవుడ్ హీరో నందు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గతేడాది బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. యాంకర్ రష్మీ హీరోయిన్గా.. రాజ్ విరాట్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ప్రశాంత్ విహారి సంగీతం అందించాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. 2006లో వచ్చిన ఫోటో సినిమా ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన నందు.. ఆ తర్వాత 100% లవ్, ఆటోనగర్ సూర్యలో పలు పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. సవారీ మూవీతో సక్సెస్ అందుకున్నారు యంగ్ హీరో. కాగా.. 2014లో గాయని గీతామాధురిని వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నందు తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో వైరలవుతోంది. కాలికి గాయమైన ఓ ఫోటోను పంచుకున్నారు. అయితే ఆ ఫోటోలో ఆయన డబ్బింగ్ చెబుతున్నట్లు కనిపిస్తోంది. నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ స్డూడియోకి వచ్చి డబ్బింగ్ చెబుతూ కనిపించారు. అయితే ఆయన కాలికి ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం మాత్రం వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం నందు సినిమాలు, క్రికెట్ కామెంటరీలతో ఫుల్ బిజీ అయిపోయారు. జిమ్‌లోనూ శ్రమిస్తూ ఫోటోలు కూడా షేర్ చేస్తుంటారు. కాగా.. నందు ప్రస్తుతం మహేశ్ బాబు మూవీ ఎస్ఎస్ఎంబి 28తో పాటు ఆర్సీ15,డిజే టిల్లు 2, హరిహరమల్లు, ధాస్ కా ధమ్కీ సినిమాల్లో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by @that_actor_nandu -
గ్రామీణ ఫ్యాక్షన్ నేపథ్యంగా 'ఏపీ04 రామాపురం' .. ట్రైలర్ విడుదల
రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ, పి.యన్ రాజ్, సునీల్ మల్లెం, నటీనటులుగా హేమ రెడ్డి దర్శత్వంలో రామ్ రెడ్డి అందూరి నిర్మించిన చిత్రం 'ఏపీ 04 రామాపురం'. ఆర్ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్వీ శివారెడ్డి సమర్పిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్లను సినీ, రాజకీయ ప్రముఖ అవిష్కరించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, జెస్సీ, నటుడు పృథ్వి కూడా పాల్గొన్నారు. బిగ్ బాస్ నటుడు జెస్సీ మాట్లాడుతూ.. ' ఈ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. టీం అందరికి అల్ ది బెస్ట్.' అన్నారు. నటుడు పృథ్వి రాజ్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా డైరెక్టర్ మోస్ట్ డేడికేటడ్ వర్కర్. చాలా తక్కువ బడ్జెట్లో హీరో ఎలివేషన్స్ బాగా తీశారు. డిసెంబర్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా'. అని అన్నారు. హీరో నందు మాట్లాడుతూ.. 'ఒక టాలెంట్‌ను నమ్మి ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ అందరికి థాంక్స్. కడపలో సినిమాకు సంబంధించి ఎటువంటి సపోర్ట్ ఉందో నాకు తెలియదు. అదే ఇక్కడ తీసుంటే ఇంకా బాగా తీసేవాళ్లేమే. ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. సోహెల్ మాట్లాడుతూ... 'నన్ను ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్స్. డైరెక్టర్ చాలా పనులు చేసుకుని ఈ స్థాయికి వచ్చారు.ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. ఈ సినిమాను దర్శకుడు తక్కువ బడ్జెట్లో తీశారు. ఈ సినిమాను చూసి ఎంకరేజ్ చెయ్యండి.' అని అన్నారు. దర్శకుడు హేమ రెడ్డి మాట్లాడుతూ..'19 ఏళ్లప్పుడు కథ రాయడం స్టార్ట్ చేశా. 23 ఏళ్లకు డైరెక్షన్ చేశా. సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ ఉండదంటారు. కానీ నా సినిమాకోసం ఇంతమంది వచ్చి ఎంకరేజ్ చేశారు. అందరికి చాలా పెద్ద థాంక్స్.' అని అన్నారు. చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. 'మా సినిమాను ఎంకరేజ్ చెయ్యడానికి వచ్చిన మీ అందరికి చాలా పెద్ద థాంక్స్. మాకు ఉన్న చిన్న బడ్జెట్లో సినిమాను చేశాం. మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాం.' అని అన్నారు. -
డ్రగ్స్ కేసులో హీరో నందు విచారణ పూర్తి
హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఫోన్‌కాల్స్ డేటా ఆధారంగా వర్థమాన హీరో నందు అలియాస్ ఆనంద కృష్ణను సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో భాగంగా 12వ రోజు మంగళవారం ఉదయం నందు నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి హాజరయ్యారు. కెల్విన్, జీశాన్‌లతో నందుకు పరిచయం ఉందని, అందులో భాగంగానే డ్రగ్స్ వ్యవహారంపై ప్రశ్నించనున్నామని సిట్ అధికారులు ఇప్పటికే వెల్లడించిన విషయం విదితమే. ఆ దిశగా సిట్ అధికారులు...నందూను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సుమారు మూడు గంటల పాటు ఆయన్ని సిట్ అధికారులు విచారణ జరిపారు. ప్రధానంగా కెల్విన్‌తో సంబంధంపై సిట్ ఆరా తీసినట్లు తెలిసింది. నందు విచారణతో తొలి విడత విచారణ పూర్తయింది. కాగా వర్ధమాన నటుడు తనీష్‌ను కూడా సిట్ నిన్న ప్రశ్నించిన విషయం విదితమే. ఇప్పటివరకూ సిట్ అధికారులు చిత్రపరిశ్రమకు చెందిన 11మందిని విచారణ చేశారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరా మెన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరోలు తరుణ్, నవదీప్, సినీనటి చార్మీ, ముమైత్ ఖాన్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, హీరో రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాసరావు, తనీష్ సిట్ విచారణకు హాజరయ్యారు. కాగా తర్వలో మరికొందరికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. -
నా జీవితంలో డ్రగ్స్ చూడలేదు: హీరో
హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంతో తమకు ఎటువంటి సంబంధం లేదని హీరో నందు తెలిపారు. తన జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ చూడలేదన్నారు. అలాంటిది మీడియాలో నా పేరు కూడా రావడం ఆశ్ఛర్యానికి గురిచేసింది. అధికారుల నుంచి తనకు ఎటువంటి నోటీసులు అందలేదని చెప్పారు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని, ఈ కేసుతో నాకు సంబంధం లేదన్నారు. ఏ పరీక్షకైనా తాను సిద్ధమని, డ్రగ్ కేసులో తనను ఇరికించే ఉద్దేశంతోనే ఇదంతా చేసివుంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. మీడియా దయచేసి వాస్తవాలు తెలుసుకుని వెలుగులోకి తేవాలని కోరారు. డ్రగ్స్ కేసులో తన పేరు బయటపెట్టడం బాధగా ఉందని ఆర్ట్ డైరెక్టర్ చిన్నా అన్నారు. టీవీల్లో నాపేరు చూసి షాక్ గురయ్యానని, డ్రగ్స్ వ్యవహారం గురించి తనకేమీ తెలియదని చెప్పారు. అసలు తనకు ఎలాంటి అలవాట్లు లేవని తెలిపారు. డ్రగ్స్ విషయంలో తనపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. అధికారుల నుంచి నాకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు.