నా జీవితంలో డ్రగ్స్‌ చూడలేదు: హీరో | hero nandu, art director chinna respond on drugs allegations | Sakshi
Sakshi News home page

నా జీవితంలో డ్రగ్స్‌ చూడలేదు: హీరో

Published Fri, Jul 14 2017 11:05 AM | Last Updated on Fri, May 25 2018 2:11 PM

నా జీవితంలో డ్రగ్స్‌ చూడలేదు: హీరో - Sakshi

నా జీవితంలో డ్రగ్స్‌ చూడలేదు: హీరో

హైదరాబాద్‌: డ్రగ్స్‌ వ్యవహారంతో తమకు ఎటువంటి సంబంధం లేదని హీరో నందు తెలిపారు. తన జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్‌ చూడలేదన్నారు. అలాంటిది మీడియాలో నా పేరు కూడా రావడం ఆశ్ఛర్యానికి గురిచేసింది. అధికారుల నుంచి తనకు ఎటువంటి నోటీసులు అందలేదని చెప్పారు. తనకు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు లేదని, ఈ కేసుతో నాకు సంబంధం లేదన్నారు. ఏ పరీక్షకైనా తాను సిద్ధమని, డ్రగ్‌ కేసులో తనను ఇరికించే ఉద్దేశంతోనే ఇదంతా చేసివుంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. మీడియా దయచేసి వాస్తవాలు తెలుసుకుని వెలుగులోకి తేవాలని కోరారు.

డ్రగ్స్‌ కేసులో తన పేరు బయటపెట్టడం బాధగా ఉందని ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా అన్నారు. టీవీల్లో నాపేరు చూసి షాక్‌ గురయ్యానని, డ్రగ్స్‌ వ్యవహారం గురించి తనకేమీ తెలియదని చెప్పారు. అసలు తనకు ఎలాంటి అలవాట్లు లేవని తెలిపారు. డ్రగ్స్‌ విషయంలో తనపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. అధికారుల నుంచి నాకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement