Odia television actor
-
బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ
సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఒడియా బుల్లితెర నటి రష్మీ రేఖ ఓజా జూన్ 18 రాత్రి ఆత్యహత్యకు పాల్పడింది. భువనేశ్వర్‌లోని గదసాహీ ప్రాంతానికి సమీపంలోని నాయపల్లిలో ఉన్న తన అద్దె ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. గత కొద్ది రోజులుగా ఈ ఇంట్లోనే రష్మీ అద్దెకు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇంటి యజమాని సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న గదిలో ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో తన మరణానికి ఎవరు కారణం కాదని తెలిపింది. ఇంకా 'ఐ లవ్ యూ సాన్' అని రాసుకొచ్చింది. అయితే 23 ఏళ్ల రష్మీ రేఖ కొన్నాళ్లుగా సంతోష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. రష్మీ మరణానికి సంతోష్ కారణమై ఉండొచ్చని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. 'శనివారం (జూన్ 18) రష్మీకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. తర్వాత తను చనిపోయినట్లు సంతోష్ మాకు చెప్పాడు. సంతోష్, రష్మీ భార్యాభర్తలుగా నివసిస్తున్నట్లు ఇంటి యజమాని చెప్పేంత వరకు ఆ విషయం మాకు తెలియదు.' అని రష్మీ రేఖ తండ్రి తెలిపారు. జగత్సింగ్పూర్ జిల్లాకు చెందిన రష్మీ 'కెమిటి కహిబి కహా' అనే ఒడియా సీరియల్‌తో గుర్తింపు పొందింది. చదవండి: సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్.. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
గర్ల్‌ఫ్రెండ్ ఫిర్యాదుతో సీరియల్ నటుడి అరెస్ట్.. ఎందుకంటే ?
Odia Serial Actor M Suman Kumar Arrested For Cheating Girlfriend Case: సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైన హీరోయిన్లు చాలానే ఉన్నారు. ఇటీవల కాలంలో వారు ఒక్కొక్కరిగా వారికి జరిగిన అన్యాయాలను బయటపెడుతున్నారు. అలాగే లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న పెద్ద పెద్ద మేల్ సెలబ్రిటీలు కూడా లేకపోలేదు. తాజాగా ఒక టీవీ సీరియల్ నటుడు ప్రేమ, పెళ్లి పేరు చెప్పి శారీరకంగా లొంగదీసుకుని, మోసం చేశాడనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. ఒడియా టీవీ సీరియల్లో నటించే ఎం సుమన్ కుమార్‌ను భువనేశ్వర్‌లోని పహాలా పోలీసులు ఆదివారం (ఏప్రిల్ 24) అరెస్ట్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఓ అమ్మాయిని మోసం చేశాడనే ఆరోపణలతో సుమన్ కుమార్‌పై కేసు నమోదు అయింది. నటుడు ఎం సుమన్ గత రెండేళ్లుగా అమ్మాయితో సంబంధం కొనసాగిస్తున్నట్లు బాధితురాలి తరఫు న్యాయవాది ప్రశాంత్ దే తెలిపారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి అమ్మాయితో సాన్నిహిత్యం పెంచుకున్నాడన్నారు. తీరా పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ముఖం చాటేశాడని ఆయన పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 376 (2) (ఎన్), 420, 294, 323, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. చదవండి: ఆ నటుడికి 61 ఏళ్లు.. రెండేళ్ల వివాహ బంధానికి విడాకులు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నటుడు అటల్ బిహారి పండా ఇక లేరు
భువనేశ్వర్: చలనచిత్ర, నాటక రంగ ప్రముఖ నటుడు అటల్ బిహారి పండా (92) కన్నుమూశారు. ఆయన మృతితో చలన చిత్రం, నాటక రంగం కళాప్రియులు, అభిమానులు, నటీనటులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటీవల ఆయన కోవిడ్ –19 బారిన పడి చికిత్సతో కోలుకున్నారు. తదనంతర అనారోగ్య పరిస్థితులతో మరోసారి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించారు. సువర్ణపూర్ జిల్లా బొణికా గ్రామానికి చెందిన ఆయన 1944వ సంవత్సరంలో నాటక రంగంలో ప్రవేశించి 100 పైబడి నాటకాల్లో నటించారు. సంబల్పురి శైలిలో 65 రంగస్థల, ఆకాశవాణి నాటకాలు రచించారు. 83 ఏళ్ల ప్రాయంలో తొలి సారి 'సొలా బుఢా' అనే లఘు చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో నటనకు ఆయన జాతీయ పురస్కారంతో పాటు 25వ ఒడియా చలన చిత్రోత్సవంలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. రెండో చలన చిత్రం 'ఆదిమ్ బిచారొ' వరుసగా రెండోసారి రాష్ట్ర చలన చిత్రోత్సవ పురస్కారం అందుకుంది. ఆయన మృతి పట్ల రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. చదవండి: డాక్టర్‌తో రహస్య పెళ్లి : అందుకే అందరికి చెప్పలేదు.. సంజన -
నటుడి ఆత్మహత్య కేసులో టీవీ నటికి బెయిల్
భువనేశ్వర్: ఒరియా టీవీ నటుడు రంజిత్ పట్నాయక్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన టీవీ నటి ప్రలిప్త ప్రియదర్శిని అలియాస్ జెస్పీకి బెయిల్ లభించింది. మంగళవారం బలాసోర్ జిల్లా సెషన్స్ కోర్టు 2 లక్షల రూపాయల చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 6న రంజిత్, జెస్సీ ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొనేందుకు బలాసోర్ జిల్లా ఖైరా ప్రాంతానికి వెళ్లారు. ఈ కార్యక్రమానికి జెస్సీతో పాటు చందన్ అనే మరో నటుడ్ని ఆహ్వానించారు. రంజిత్‌కు ఆహ్మానం లేకపోయినా జెస్సీకి తోడుగా వెళ్లాడు. జెస్సీ, చందన్ కలసి ప్రదర్శన ఇవ్వాల్సి ఉండగా, నిర్వాహకులు రంజిత్‌ను ఆహ్వానించారు. ఈ విషయం గురించి కార్యక్రమం ముగిసిన తర్వాత కారులో వస్తూ జెస్సీ, రంజిత్ గొడవపడ్డారు. జెస్సీ పరుష పదజాలంతో నిందించింది. రంజిత్ కారును ఆపాల్సిందిగా డ్రైవర్‌కు చెప్పాడు. రంజిత్ కారు దిగి బ్రిడ్జిపై నుంచి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడిన రంజిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రంజిత్ పట్నాయక్ ఆత్మహత్యకు కారణమైందంటూ ఫిబ్రవరి 16న పోలీసులు జెస్సీని అరెస్ట్ చేశారు.