![Vodafone-idea is offering job opportunities for women of Bharat - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/11/VI.jpg.webp?itok=5TdpoV5E)
ముంబై: జాబ్ సెర్చ్ ప్లాట్‌ఫామ్ అప్నాతో కలిసి తమ యాప్ ద్వారా మహిళలకు ఉద్యోగావకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టెలికం సంస్థ వొడాఫోన్–ఐడియా (వీఐ) తెలిపింది. దీని ద్వారా టీచర్ల నుంచి టెలీకాలర్లు, రిసెప్షనిస్టుల వరకూ వేల సంఖ్యలో పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
అలాగే, టెలీ–కాలర్లు కాద ల్చుకునే మహిళలకు రూ. 5,000 డిస్కౌంటుతో ప్లేస్‌మెంట్ గ్యారంటీ శిక్షణ ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తున్నామని వివరించింది. అటు ఎన్‌గురుతో కలిసి 50 శాతం డిస్కౌంటుతో ఇంగ్లీష్ శిక్షణా కోర్సులనూ అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్లు మార్చి 14 వరకూ వీఐ యాప్‌లో అందుబాటులో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment