పెళ్లి పేరుతో రూ.70 లక్షలు దోచేశాడు! | Sakshi
Sakshi News home page

పెళ్లి పేరుతో రూ.70 లక్షలు దోచేశాడు!

Published Sun, Mar 24 2024 7:02 AM

man cheating to women  - Sakshi

సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ మహిళ నుంచి రూ.70 లక్షలు వసూలు చేసిన ఘరానా మోసగాడిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శనివారం అరెస్టు చేసి, జ్యుడీయల్‌ రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ రవీంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన ద్రోణాదుల రాజేశ్‌ స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేస్తుంటాడు. జూదం, విలాసాలకు బానిసై డబ్బు కోసం మ్యాట్రిమోనీ యాప్‌లలో నకిలీ ప్రొఫైల్స్‌ పెట్టి అమ్మాయిలకు వల వేస్తుంటాడు. 

ఈక్రమంలో గతేడాది ఏప్రిల్‌లో తెలుగు మ్యాట్రిమోనీ యాప్‌లో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. రోజూ వాట్సాప్‌లో సంభాషణలు, చాటింగ్‌లతో ఆమెకు మాయమాటలు చెబుతూ నమ్మించాడు. ఈక్రమంలో పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో పూర్తిగా విశ్వసించి.. ఒకసారి వ్యక్తిగతంగా కలిసి మాట్లాడదామని కోరింది. దీంతో తన తల్లిదండ్రులు, తమ్ముడు కృష్ణా జిల్లాలో నివాసం ఉంటున్నారని, కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పాడు. సహాయం చేయాలని కోరడంతో ఆమె గతేడాది ఏప్రిల్‌ 30న రూ.2 లక్షలు నగదు ఇచి్చంది. దీంతో ఇద్దరూ ప్రకాశ్‌నగర్‌లోని ఓ హోటల్‌లో కలిశారు. 

ఇక అప్పటి నుంచి మాయమాటలు చెబుతూ డబ్బు వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఈ సొమ్ముతో జూదం, క్రిప్టో కరెన్సీ, స్టాక్‌ మార్కెట్ల ట్రేడింగ్‌ చేసేవాడు. అప్పు చేసి మరీ.. ముత్తూట్‌ ఫైనాన్స్‌లో బంగారం రుణం, రూ.52 లక్షలు గృహరుణంతో పాటు మనీవ్యూ, పోస్ట్‌పే వంటి వ్యక్తిగత రుణ యాప్‌లలో లోన్లు తీసుకొని మొత్తం రూ.70 లక్షలు రాజేశ్‌కు ఇచ్చింది. అనంతరం నిందితుడు ఆమెను పట్టించుకోవడం మానేశాడు. అంతేకాకుండా ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాజేశ్‌ను అరెస్టు చేసి, అతని నుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement