
మెగాస్టార్ చిరంజీవి సతీమణి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తల్లి సురేఖ కొణిదెల రీసెంట్‌గా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సురేఖ కొణిదేల పేరుతో ట్విటర్ ఖాతా దర్శనమిచ్చింది. అంతేకాదు తన తొలిపోస్ట్ తనయుడి గురించే షేర్ చేయడంలో మెగా ఫ్యాన్స్ సంతోషం మరింత రెట్టింపు అయ్యింది. దీంతో వరసగా మెగా ప్యాన్స్, నెటిజన్లు ఆమెను ఫాలో అవ్వడం మొదలు పెట్టారు.
చదవండి: సాయి పల్లవి యాడ్ రిజెక్ట్ చేయడంపై స్పందించిన సుకుమార్
ఈ క్రమంలో కొద్ది గంట్లోనే ఈ ఫ్రొఫైల్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య 2 వేలు దాటింది. ఇదిలా ఉంటే. ఇప్పుడు వారందరికి షాకిస్తూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. చూస్తుంటే ఇది తన నిజమైన ఖాతా కాదని తెలింది. ఎందుకంటే ఈ ఫ్రొఫైల్‌ను మెగా కుటుంబంలోని ఏ ఒక్కరూ ఫాలో కావడం లేదు. అంతేకాదు సురేఖ కొణిదెల ఇంటి పేరులో స్పెల్లింగ్ మిస్టెక్ కూడా ఉంది.
చదవండి: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ
ఇది మెగా ఫ్యాన్ పని అని, ఎవరో సురేఖ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. తల్లికొడుకుల ఫొటోను షేర్ చేసిన అభిమానం చాటుకున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై మెగా కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా ‘నా సూపర్ స్టైలిష్ కొడుకుతో నా మొదటి పోస్ట్‌తో ట్విటర్లో చేరినందుకు సంతోషంగా ఉంది’అంటూ ఈ పోస్ట్‌ను షేర్ చేయండంతో ఇది నిజమైన అకౌంట్ అనుకుని అంతా భ్రమపడ్డారు. ఇదిలా ఉంటే గతంలో కూడా సోషల్ మీడియాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి పేరుతో కూడా ఫేక్ అకౌంట్ దర్శమించిన సంగతి తెలిసిందే.
Happy To Join On Twitter My First Post With Super Stylish Son @AlwaysRamCharan #RamCharan #RamCharan𓃵 #RRR. pic.twitter.com/BviB9PnvGP
— Surekha Konidala (@SurekhaKonidala) February 26, 2022