రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయం
అంచనా వ్యయం రూ.కోటి కంటే ఎక్కువ ఉంటే 10 శాతం అడ్వాన్స్
మొబిలైజేషన్ అడ్వాన్స్‌ను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
2014–19 తరహాలోనే మళ్లీ దోపిడీకి తెర తీశారంటున్న నిపుణులు
సాక్షి, అమరావతి: ఏ పనికైనా అంచనా వ్యయం రూ.కోటి కంటే ఎక్కువ ఉంటే సంబంధిత కాంట్రాక్టర్‌కు 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొబిలైజైషన్ అడ్వాన్స్‌ను రద్దు చేస్తూ 2019 డిసెంబర్ 17న జారీ చేసిన ఉత్తర్వుల(జీవో 83)ను రద్దు చేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ బుధవారం ఉత్తర్వులు (జీవో 57) జారీ చేశారు.
2014–19 తరహాలోనే అయిన వారికి, అధిక ధరలకు పనులను కట్టబెట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్‌లను ముట్టజెప్పి.. వాటిని కమీషన్లుగా వసూలు చేసుకుని ఖజానాను దోచేసేందుకు ప్రభుత్వ పెద్దలు మళ్లీ తెర తీశారని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం టెండర్ వ్యవస్థను నీరుగార్చి.. ముందే ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అంచనా వ్యయం కంటే అధిక ధరలకు పనులు కట్టబెట్టేవారు.
వారికి మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ముట్టజెప్పి.. వాటినే కమీషన్లుగా వసూలు చేసుకుందని ఇంజినీరింగ్ నిపుణులు అప్పట్లో ఆరోపించారు. అంచనా విలువ కంటే అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.20 వేల కోట్లకుపైగా భారం పడిందని అప్పట్లో లెక్కలు వేశారు. ఈ నేపథ్యంలో 2019 మే 30న అధికారంలోకి వచి్చన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం టెండర్ల వ్యవస్థను ప్రక్షాళన చేసింది.
రూ.వంద కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అంచనా వ్యయం ఉన్న పనుల టెండర్ షెడ్యూల్‌ను జ్యుడీíÙయల్ ప్రివ్యూకు పంపి ఆమోదం తీసుకున్న తర్వాతే టెండర్లు పిలవాలని ఉత్తర్వులు జారీ చేసింది. రూ.కోటి అంతకంటే ఎక్కువ అంచనా వ్యయం ఉన్న పనులకు రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు పిలవాలని నిర్దేశించింది. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వాలన్న నిబంధనను రద్దు చేసింది.
2019 ఆగస్టు నుంచి 2024 ఫిబ్రవరి వరకూ నిర్వహించిన టెండర్లలో అంచనా వ్యయం కంటే తక్కువ ధరకే పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా అయ్యింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన వెంటనే జ్యుడీíÙయల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఇప్పటికే రద్దు చేసింది. తాజాగా కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేందుకు ఆమోదం తెలపడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment