రోడ్డు పక్కన ప్రభుత్వ స్థలంలో తలపెట్టిన మద్యం దుకాణం ఏర్పాటును మహిళలు అడ్డుకున్నారు.
రోడ్డు పక్కన ప్రభుత్వ స్థలంలో తలపెట్టిన మద్యం దుకాణం ఏర్పాటును మహిళలు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం సీతారామపురం గ్రామానికి మద్యం దుకాణం మంజూరైంది. దీనిని దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డు పక్కన గుడి, బడికి సమీపంలోనే దుకాణాన్ని ఏర్పాటు చేయటానికి పనులు ప్రారంభించాడు. ఇది తెలిసిన గ్రామస్తులు మహిళలు సుమారు 200 మంది దుకాణం నిర్మాణానికి తవ్విన పునాది గుంతలను పూడ్చివేశారు. అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.