
సాక్షి, న్యూఢిల్లీ : విద్యార్ధులు, సిబ్బందికి ఆహారం సమకూర్చే మెస్‌ల పైనా జీఎస్‌టీ వర్తింపచేశారు. విద్యాసంస్థల్లో మెస్ ఎవరు ఏర్పాటు చేశారనే దానితో సంబంధం లేకుండా వీటిపై 5 శాతం జీఎస్‌టీ చార్జ్ చేయనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాలేజ్ హాస్టల్ మెస్‌లకు సంబంధించి జీఎస్‌టీ వివరాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) ఈ మేరకు వివరణ ఇచ్చింది.
మెస్‌లు, క్యాంటిన్‌లపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా 5 శాతం జీఎస్‌టీ విధిస్తారని పేర్కొంది. ఈ మెస్ లేదా క్యాంటిన్‌ను ఆయా విద్యా సంస్థలే నిర్వహిస్తున్నాయా, బయటి వ్యక్తులకు కాంట్రాక్టుకు ఇచ్చారా అనే అంశంతో సంబంధం లేకుండా ఐదు శాతం జీఎస్‌టీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment