Hostel mess
-
ఢిల్లీ జేఎన్‌యూలో విద్యార్థి సంఘాల ఘర్షణ
న్యూఢిల్లీ: రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య ఆదివారం తీవ్ర ఘర్షణ చెలరేగింది. దాంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల రాళ్ల దాడిలో పలువురు గాయపడ్డారు. క్యాంపస్‌లోని కావేరీ హాస్టల్ మెస్‌లో మాంసాహారం వడ్డించకుండా ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ (జేఎన్‌యూఎస్‌యూ) కార్యకర్తలు ఆరోపించారు. క్యాంపస్‌లో రామనవమి పూజకు జేఎన్‌యూఎస్‌యూ నేతలు ఆటంకాలు సృష్టించారని ఏబీవీపీ కార్యకర్తలు పేర్కొన్నారు. దాంతో రగడ మొదలయ్యింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారని పోలీసులు చెప్పారు. కానీ, దాదాపు 60 మందికి గాయాలయ్యాయని జేఎన్‌యూఎస్‌యూ నేతలు పేర్కొన్నారు. తమ కార్యకర్తలు 10 మంది గాయపడ్డారని ఏబీవీపీ నాయకులు తెలిపారు. -
హాస్టల్ మెస్‌పైనా జీఎస్టీ వడ్డన
సాక్షి, న్యూఢిల్లీ : విద్యార్ధులు, సిబ్బందికి ఆహారం సమకూర్చే మెస్‌ల పైనా జీఎస్టీ వర్తింపచేశారు. విద్యాసంస్థల్లో మెస్ ఎవరు ఏర్పాటు చేశారనే దానితో సంబంధం లేకుండా వీటిపై 5 శాతం జీఎస్టీ చార్జ్ చేయనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాలేజ్ హాస్టల్ మెస్‌లకు సంబంధించి జీఎస్టీ వివరాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) ఈ మేరకు వివరణ ఇచ్చింది. మెస్‌లు, క్యాంటిన్లపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా 5 శాతం జీఎస్టీ విధిస్తారని పేర్కొంది. ఈ మెస్ లేదా క్యాంటిన్‌ను ఆయా విద్యా సంస్థలే నిర్వహిస్తున్నాయా, బయటి వ్యక్తులకు కాంట్రాక్టుకు ఇచ్చారా అనే అంశంతో సంబంధం లేకుండా ఐదు శాతం జీఎస్టీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. -
గుంటూరు నిమ్స్ కాలేజ్ మెస్‌లో యువకుడు మృతి
-
హాస్టల్ మెస్‌ల మూసివేత.. ఓయూలో ఆందోళన
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలోని ఆర్ట్ అండ్ సోషల్ సైన్స్ కాలేజీకి చెందిన హాస్టల్ మెస్‌లను శుక్రవారం నుంచి మూసేస్తున్నట్లు ప్రకటించడంతో యూనివర్సిటీలో ఆందోళన మొదలైంది. ఓయూకు సంబంధించిన అన్ని హాస్టల్ మెస్‌ల ఖాతాలో బ్యాలెన్స్ లేదని, తమకు రావాల్సిన స్కాలర్షిప్లను సాంఘి సంక్షేమ శాఖ నుంచి ఇంకా విడుదల చేయలేదని.. దాంతో శుక్రవారం ఉదయం అల్పాహారం తర్వాత ఏ, సీ హాస్టళ్లను మూసేస్తున్నామని నోటీసుబోర్డులో తెలిపారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత మరింత బాగుంటుందని ఆశిస్తే.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా కనీసం తమకు తిండి కూడా పెట్టకుండా మాడుస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. దీనిపై రిజిస్ట్రార్ సురేష్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణారావులను కలిసి తమ ఆందోళనను తెలియజేస్తామన్నారు.