ట్రాన్స్‌కో కణేకల్లు మండల అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) లక్ష్మిరెడ్డి శనివారం ఉరవకొండలో కాంట్రాక్టర్ నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు.
ఉరవకొండ, న్యూస్‌లైన్ : ట్రాన్స్‌కో కణేకల్లు మండల అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) లక్ష్మిరెడ్డి శనివారం ఉరవకొండలో కాంట్రాక్టర్ నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నారుు. అనంతపురం జిల్లా కణేకల్లు వుండలం ఎర్రగుడికి చెందిన అవుర్‌నాథ్ ట్రాన్స్‌కో కాంట్రాక్టర్. ఈయన కణేకల్లు వుండల పరిధిలో నూతనంగా ట్రాన్స్‌ఫార్మర్‌లు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయించారు. ఇందుకు సంబంధించి రూ.6 లక్షల బిల్లులు రావాల్సివుంది. ఎం.బుక్‌లో సంతకాల కోసం ఏఈ లక్ష్మిరెడ్డి వద్దకు వెళ్లగా రూ.25 వేలు లంచం డిమాండ్ చేశారు. అంతమొత్తం ఇవ్వలేనని, రూ.15 వేలు ఇవ్వగలనని ఆయన అన్నారు.
అయితే..లంచం ఇచ్చి బిల్లులు చేయించుకోవడం ఇష్టలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏఈని వల పన్ని పట్టుకోవడానికి వారు పథకం రూపొందించారు. అందులో భాగంగా శనివారం ఉరవకొండలోని ట్రాన్స్‌కో ఏడీఈ కార్యాలయుం వద్ద కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీతో పాటు సీఐలు గిరిధర్, ప్రభాకర్ పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఏసీబీకి దొరికిన ట్రాన్స్‌కో ఏఈల్లో లక్ష్మిరెడ్డి రెండోవాడు. జనవరి 16న ఉరవకొండ ఏఈ వుహేష్ కూడా విద్యుత్ కనెక్షన్ కోసం లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. వుూడేళ్ల నుంచి కణేకల్లు మండలంలో పనిచేస్తున్న ఏఈ ఉరవకొండలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.