టన్నెల్ పనుల తనిఖీ
Published Sun, Oct 9 2016 12:32 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
అవుకు: గాలేరు–నగరి సుజల స్రవంతి పనుల్లో భాగంగా అవుకు టన్నెల్ (ప్యాకేజ్ నంబర్–30) నిర్మాణ పనులను సీఈ నారాయణరెడ్డి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలతో పాటు కాంట్రాక్టర్ల పై ఒత్తిడి పెంచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అవుకు టన్నెల్ పనుల్లో ఒక సొరంగం 300 మీటర్లు మేర ఫాల్ట్‌జోన్ ఉందని, దీంతో రైట్ డైవర్స్‌న్‌లో దాదాపు 394 మీటర్లలో మరో టన్నెల్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం 100 మీటర్ల పనులు మాత్రమే పెండింగ్‌లో ఉందని,రోజుకు 10 మీటర్ల తగ్గకుండా చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ నెల చివరినాటికి ఒక సొరంగం పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఈ సూర్య కుమార్, ఈఈ పాపారావు, డీఈలు మనోహర్ రాజు, శివప్రసాద్, మురళీకృష్ట, క్యాలిటీ కంట్రోల్ డీఈ చిదంబర్ రెడ్డి, టన్నెల్ జీఎం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement