galeru nagari
-
యుద్ధప్రాతిపదికన హంద్రీ-నీవా, గాలేరు-నగర, తెలుగుగంగ పనులు
-
రూ.5,036 కోట్లతో.. గాలేరు నగరి, హంద్రీనీవా ఎత్తిపోతల
సాక్షి, అమరావతి: గాలేరు నగరి, హంద్రీనీవాలను అనుసంధానం చేయడం ద్వారా రెండు పథకాల కింద ఆయకట్టుకు సమర్థంగా నీళ్లందించే పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కృష్ణా నదికి వరద వచ్చే 40 రోజుల్లోనే వరద జలాలను ఒడిసి పట్టి ప్రాజెక్టులను నింపడం ద్వారా దుర్భిక్ష రాయలసీమను సుభిక్షం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధృడ సంకల్పంతో పనులు చేపట్టిన విషయం తెలిసిందే. ► గాలేరు నగరి సుజల స్రవంతి నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలోకి నీటిని ఎత్తిపోసే పనులను రూ.5,036 కోట్లతో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ► గండికోట సీబీఆర్(చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) ఎత్తిపోతల, గండికోట పైడిపాలెం ఎత్తిపోతల అభివృద్ధి పనులను రూ.3,556.76 కోట్లతో చేపట్టేందుకు కూడా పరిపాలన అనుమతి ఇచ్చింది. ► గాలేరు నగరి సుజల స్రవంతి నుంచి గండికోట రిజర్వాయర్‌కు మరో పది వేల క్యూసెక్కులు తరలించేందుకు వీలుగా వరద కాలువలో 52.184 కి.మీ నుంచి 58.835 కి.మీ వరకు అదనపు టన్నెల్ తవ్వకం పనులను రూ.604.80 కోట్లతో చేపట్టడానికి అంగీకరించింది. ► సీబీఆర్ నుంచి ఎర్రబెల్లి చెరువులోకి నీటిని ఎత్తిపోసి గిడ్డంగివారిపల్లి వద్ద కొత్తగా 1.20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్‌లోకి తరలించి పులివెందుల, వేముల మండలాల్లో యూసీఐఎల్(యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ప్రభావిత ఏడు గ్రామాల్లో సూక్ష్మనీటిపారుదల పద్ధతిలో పది వేల ఎకరాలకు నీళ్లందించే పనులను రూ.1,113 కోట్లతో చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. ► వీటికి సంబంధించిన టెండర్ షెడ్యూళ్లను జ్యుడిషియల్ ప్రివ్యూ(న్యాయ పరిశీలన)కు పంపేందుకు జలవనరుల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ► వైఎస్సార్ జిల్లాలో ఆదినిమ్మాయపల్లె ఆనకట్టకు దిగువన పుష్పగిరి దేవాలయం వద్ద ఒక టీఎంసీ సామర్థ్యంతో పెన్నా నదిపై రిజర్వాయర్ నిర్మాణానికి డీపీఆర్ రూపకల్పనకు కూడా రూ.35.50 లక్షలతో పరిపాలన అనుమతి మంజూరైంది. -
బైపాస్ టన్నెల్ పూర్తి
అవుకు: గాలేరు నగరి సుజల స్రవంతి ప్యాకేజ్ నెంబర్–30లో భాగంగా అవుకులో నిర్మిస్తున్న సొరంగాల్లో ఒక (బైపాస్) టన్నెల్ పూర్తి అయినట్లు ఈఈ పాపారావు తెలిపారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ రెండు సోరంగాలు ఒక్కొక్కటి 6కిమీ పొడవుతో 20 వేల క్యూసెక్కుల నీటిని పంపడానికి డిజైన్ చేసినట్లు తెలిపారు. ఎన్ట్రీ నుంచి ఆడిట్ పాయింట్‌కు మధ్యలో లెఫ్ట్ టన్నెల్లో 300 మీటర్లు, రైట్ టన్నెల్లో 394 మీటర్ల మేర ఫాల్ట్‌జోన్ ఉండటం వల్ల టన్నెల్ పని సమస్యగా మారిందన్నారు. ఈ సమస్యను అధిగమించడానికె బైపాస్ టన్నెల్‌ను నిర్మించామన్నారు. బైపాస్ టన్నెల్లో 5 వేల క్యూసెక్కుల నీరు వెళ్తుందన్నారు. రెండు నెలల్లో లైనింగ్ పనులు పూర్తి చేసి వచ్చె ఖరీఫ్ సీజన్‌కు ఒక సొరంగం ద్వారా వైఎస్సార్ కడప జిల్లాకు నీరు తప్పక అందిస్తామన్నారు. కార్యక్రమంలో డీఈ మనోహర్ రాజు, టన్నెల్ జీఎం శ్రీవారి, సిబ్బంది నాగభూషణం పాల్గొన్నారు. -
డిసెంబర్ చివరి నాటీకి గాలేరు-నగరి పూర్తి
- గోరుకల్లుపై రెండు రోజుల్లో నిర్ణయం - సాగునీటి తర్వాత చూద్దామంటూ దాటవేత - సాగునీటి ప్రాజెక్టులపై సీఈలతో సీఎం సమీక్ష కర్నూలు సిటీ: రాయల సీమ జిల్లాలకు ప్రధానమైన గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం పనులు వచ్చే నెల చివరి నాటికి కచ్చితంగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు జల వనరుల శాఖ సీఈని ఆదేశించారు. సోమవారం విజయవాడలో సాగునీటి ప్రాజెక్టుల పనులపై సీఎం సమీక్షించారు. రాయలసీమలోని కడప, చిత్తూరు, నెల్లురు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు ఈ ఏడాది కచ్చితంగా కాల్వలో నీరు పారించాలన్నారు. పనుల్లో ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకరావాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పనులు చేయని కాంట్రాక్టర్లతో మాట్లాడి వేగవంతం చేయాలన్నారు. ఎస్ఆర్బీసీ విస్తరణ పనులు డిసెంబరు 15 లోగా పూర్తి చేయాలన్నారు. ప్రధాన కాల్వలో కనీసం 5 వేల క్యుసెక్కుల నీరు పారేలా పనులు చేయించాలని సీఎం ఇంజినీర్లకు సూచించారు. గోరుకల్లు పరిస్థితి ఎంటని, ఎందుకు లీకేజీలే అవుతున్నాయని సీఎం ఆరా తీశారు. నివారణ చర్యలు చేపట్టేందుకు లోడెడ్ బర్మ్‌కు రూ. 45 కోట్లతో అంచనాలు వేశామని, దీనిపై రెండు రోజుల్లో ప్రిన్సిపాల్ సెక్రటరీ, సీఈ, మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. టీబీ డ్యాం నీటి గురించి జిల్లా ఇంజినీర్లు పంపిన నివేదికలపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుదని పేర్కంటూ సీఎం దాటవేసినట్లు తెలిసింది. వచ్చే నెల చివరి నాటికి గండికోటకు కచ్చితంగా 5 వేల క్యుసెక్కుల నీరు వెళ్లేలా పనులు చేయించాలన్నారు. అలాగే ఆవుకు సొరంగం పనుల గురించి సీఎం సీఈని అడిగి తెలుసుకున్నారు. -
టన్నెల్ పనుల తనిఖీ
అవుకు: గాలేరు–నగరి సుజల స్రవంతి పనుల్లో భాగంగా అవుకు టన్నెల్ (ప్యాకేజ్ నంబర్–30) నిర్మాణ పనులను సీఈ నారాయణరెడ్డి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలతో పాటు కాంట్రాక్టర్ల పై ఒత్తిడి పెంచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అవుకు టన్నెల్ పనుల్లో ఒక సొరంగం 300 మీటర్లు మేర ఫాల్ట్‌జోన్ ఉందని, దీంతో రైట్ డైవర్స్న్లో దాదాపు 394 మీటర్లలో మరో టన్నెల్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం 100 మీటర్ల పనులు మాత్రమే పెండింగ్‌లో ఉందని,రోజుకు 10 మీటర్ల తగ్గకుండా చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ నెల చివరినాటికి ఒక సొరంగం పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్ఈ సూర్య కుమార్, ఈఈ పాపారావు, డీఈలు మనోహర్ రాజు, శివప్రసాద్, మురళీకృష్ట, క్యాలిటీ కంట్రోల్ డీఈ చిదంబర్ రెడ్డి, టన్నెల్ జీఎం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
గాలేరు-నగరి.. ఆగుతూ.. సాగుతూ!
అంచనాలు పెంచినా అలసత్వమే గత నెలతోనే ముగిసిన నిర్మాణ గడువు జూన్ నాటికే పూర్తి చేస్తామన్న సీఎం, మంత్రి వచ్చే ఏడాది జూన్ వరకు గడువు పొడిగింపు కర్నూలు సిటి: నిర్ణీత గడువులోపు ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే కాంట్రాక్టు ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెడతామని ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నా పురోగతి కరువయింది. ఈ ఏడాది జూన్ నాటికి గాలేరు-నగరి పనులు పూర్తి చేసి గండికోటకు కృష్ణా జలాలను తరలిస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇటీవల జిల్లా పర్యటనలో ప్రకటించినా.. మాటలకే పరిమితమయింది. మాటలకు.. చేతలకు పొంతన లేని పరిస్థితి చూస్తే ప్రాజెక్టులను అనుకున్న గడువులోపు పూర్తి చేయడం అసాధ్యమనే విషయం ఇట్టే అర్థమవుతుంది. గాలేరు-నగరి సుజల స్రవంతి నిర్మాణ పనుల గడువు గత నెలతో ముగిసింది. మరోసారి గడువు పెంపునకు హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోద ముద్ర వేసి ప్రభుత్వానికి పంపగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. లక్ష్యం.. శ్రీశైలం బ్యాక్ వాటర్ తరలింపుతో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం. ఇప్పుడెక్కడ.. రూ.2155.45 కోట్లతో ఫేజ్-1 పనులను పది ప్యాకేజీలుగా విభజించి ప్రారంభించారు. ఇటీవల రూ.2800.89 కోట్లకు అంచనాలు పెంచారు. గత నెలతో గడువు ముగియగా.. మరో ఏడాది పొడిగించారు. ప్యాకేజీల వారీగా పనుల తీరుతెన్నులివీ - 24వ ప్యాకేజీ: మే నెలతో గడువు ముగిసింది. వచ్చే ఏడాది జూన్ 30 వరకు గడువు కావాలని కాంట్రాక్టర్ కోరారు. పోతిరెడ్డిపాడు వద్ద బానకచర్ల వరకు చేపట్టిన కాల్వ విస్తరణ పనులు 94.13 శాతం పూర్తయ్యాయి. - 25 ప్యాకేజీ: బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద ఎస్ఆర్బీసీ కాల్వను విస్తరించి సామర్థ్యం మేరకు అదనపు గేట్ల పనులు 90 శాతం పూర్తి కావచ్చాయి. అంచనా వ్యయం రూ.186.8 కోట్ల నుంచి 372.90.95 కోట్లకు చేరుకుంది. ఇందులో 167.16 కోట్లు ఖర్చు చేశారు. గత నెల 30తో గడువు ముగియగా.. వచ్చే ఏడాది జూన్ 30 వరకు గడువు కోరారు. - 26 ప్యాకేజి: ప్రధాన కాల్వ 25.076 కి.మీ నుంచి 56.775 కి.మీ వరకు విస్తరణ పనుల అంచనా వ్యయం రూ.257.85 కోట్ల నుంచి రూ.584 కోట్లకు పెంచారు. సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేసి 76.20 శాతం పని చేశారు. గతనెల 30తో గడువు ముగిసింది. వచ్చే ఏడాది జూన్ 30 వరకు గడువును ప్రతిపాదించారు. - 27వ ప్యాకేజీ: గోరుకల్లు రిజర్వాయర్ నుంచి 17 కి.మీ వరకు గాలేరు కాల్వ పనులు 82 శాతం చేపట్టారు. అంచనా వ్యయం రూ.290 కోట్ల నుంచి రూ.414 కోట్లకు చేరుకుంది. ఇందులో సుమారు రూ.340 కోట్లు ఖర్చు చేశారు. గత నెల 30తో గడువు ముగిసింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు గడువు కోరారు. - 28, 28ఏ ప్యాకేజీలు: గాలేరు-నగరి కాల్వ 20వేల క్యుసెక్కుల సామర్థ్యం మేరకు 17 కి.మీ నుంచి 46 కి.మీ వరకు విస్తరణ పనులు, నిర్మాణాలు చేపట్టారు. అంచనా వ్యయం రూ.214 కోట్ల నుంచి రూ.340.45 కోట్లకు చేరుకోగా, 83 శాతం పనులు పూర్తయ్యాయి. గత నెల జూన్‌తో గడువు ముగిసింది. ఇందులో 28వ ప్యాకేజీ పనులకు వచ్చే ఏడాది జూన్ 30 వరకు, 28ఏ ప్యాకేజీకి సెప్టెంబర్ 30 వరకు గడువు పెంచాలని కోరారు. - 29, 29ఏ ప్యాకేజీ: గాలేరు కాల్వ 46 కి.మీ నుంచి 57.70 కి.మీ వరకు విస్తరణ పనుల అంచనా వ్యయం రూ.229.39 కోట్ల నుంచి రూ.310.51 కోట్లకు పెరిగింది. ప్రధాన కాల్వ పనులు 93 శాతం, నిర్మాణ పనులు 72.85 శాతం పూర్తయ్యాయి. గత నెలతోనే గడువు ముగిసింది. 29వ ప్యాకేజీకి వచ్చే ఏడాది జూన్.. 29ఏ ప్యాకేజీకి సెప్టెంబర్ వరకు గడువు కోరారు. - 30వ ప్యాకేజీ: అవుకు వద్ద రెండు సొరంగాలు ఒక్కోటి 10వేల క్యుసెక్కుల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఫాల్ట్ జోన్లో కాంక్రీట్ పనులకు ఇటీవలే రీడిజైన్ సీఈ సీడీఓ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లింది. రూ.519 కోట్ల అంచనాలో రూ.425 కోట్లు ఖర్చు చేశారు. పనులు 82 శాతం పూర్తి చేశారు. పనుల పూర్తికి వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు గడువు కోరారు. - ఓసీ 50 ప్యాకేజీ: ఎస్ఆర్బీసీ 56 కి.మీ వద్ద 12 టీఎంసీల సామర్థ్యంతో గోరుకల్లు రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. ఇటీవల అంచనా వ్యయం రూ.448 కోట్ల నుంచి రూ.601 కోట్లకు చేరింది. 88 శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు వచ్చే ఏడాది జూన్ 30 వరకు గడువివ్వాలని ప్రతిపాదించారు. నెలాఖరులోపు ప్రధాన కాల్వ పనులు పూర్తి చేస్తాం గత నెలతోనే గాలేరు-నగరి నిర్మాణ గడువు ముగిసింది. ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. వీటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం మరికొంత గడువు ఇచ్చింది. ప్రధాన కాల్వ పనులు ఈ నెల చివరి నాటికి పూర్తి చేస్తాం. గండికోటకు నీరు తీసుకెళ్లే ఉద్దేశంతో పనులు వేగంగా చేయిస్తున్నాం. 21,700 క్యుసెక్కుల స్థానంలో.. 10వేల క్యుసెక్కుల నీరు తీసుకెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందుల్లేవు. - చిట్టిబాబు, సీఈ, కర్నూలు జల వనరుల శాఖ ప్రాజెక్ట్స్ -
'ఎమ్మెల్యేలను కొనడానికే సమయం వెచ్చిస్తున్న బాబు'
కడప : గాలేరు - నగరి కాల్వ పనులకు చంద్రబాబు ప్రభుత్వం నిధులు కేటాయించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఆరోపించారు. ఆదివారం కడపలో ఆ పార్టీ ఎంపీ పి.మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే అంజద్‌బాషా విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజాసేవలను విస్మరించారని మిథున్‌రెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను కొనడానికి సమయం వెచ్చిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మైనార్టీలకు అభివృద్ధి జరిగిందంటే అది దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ఆర్తోనే అని ఎమ్మెల్యే అంజాద్ బాషా స్పష్టం చేశారు.