
బొక్కలవాగును తోడేస్తున్నారు..!
మంథని : మంథనిని ఆనుకుని ప్రవహించే బొక్కలవాగు నుంచి ఇసుకను తోడేస్తున్నారు. గోదావరి, మానేరు నదుల నుంచి అక్రమంగా ఇసుక రవాణా...
మంథని : మంథనిని ఆనుకుని ప్రవహించే బొక్కలవాగు నుంచి ఇసుకను తోడేస్తున్నారు. గోదావరి, మానేరు నదుల నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా కలెక్టర్ ఆదేశాలు జారీచేయగా.. ఆయా డివిజన్లలోని ఆర్డీవోలు స్పెషల్ డ్రైవ్ పెట్టి నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. అరుుతే మంథనిలో ప్లడ్‌బ్యాంకు అభివృద్ధి పనుల పేరిట కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా వాగులో ఇసుకను పొక్లెరుునర్‌తో తోడి గుట్టలను తలపించేలా నిల్వచేశాడు.
స్థానిక అవసరాలకు కూడా వాగు ఇసుకను వాడేందుకు భవన నిర్మాణ యజమానులు ముందుకు రారు. మట్టితో కూడిన ఇసుక ఉండడంతో పగుళ్లు ఏర్పడి భవనాలు నాణ్యత దెబ్బతింటుందని దీనికి ప్రధాన కారణం. ఫ్లడ్ బ్యాంకు నిర్మాణానికి వాగు ఇసుకనే వినియోగించేలా అధికారులు అగ్రిమెంట్‌లో చేర్చడం విమర్శలకు తావిస్తోంది. పైగా ఈ ఇసుక నాణ్యతతో కూడిందా, ఫ్లడ్ బ్యాంకు అభివృద్ధి పనులకు వినియోగించొచ్చా.. అనే విషయాన్ని సాయిల్ టెస్టు నుంచి నిర్ధారణ కాకముందే కాంట్రాక్టర్ పెద్దఎత్తున ఇసుక తోడి నిల్వచేసుంటే.. ఇరిగేషన్ అధికారులు అడ్డుచెప్పకపోవడం గమనార్హం.
రూ.28 కోట్లతో చేపడుతున్న మినీ ట్యాంకుబండ్ నిర్మాణానికి మట్టితో కూడిన నాసిరకం ఇసుక వాడితే ఎంత కాలం నిలుస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఐబీ డీఈ రమేశ్‌బాబు మాట్లాడుతూ సాయిల్ టెస్టు తర్వాత ఇసుక అక్కరకు వస్తేనే కాంట్రాక్టర్ వినియోగించేలా చూస్తామని, లేకపోతే నిరాకరిస్తామని చెప్పారు.