వెలగని వీధి దీపాలు | Street lights did not fire | Sakshi
Sakshi News home page

వెలగని వీధి దీపాలు

Published Mon, Sep 9 2013 12:44 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM

Street lights did not fire

సాక్షి, ముంబై: నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు వెలుగులు విరజిమ్మటం లేదు. వీటి బాధ్యతలను పర్యవేక్షించే కాంట్రాక్టర్ కాల పరిమితి ముగిసిందని పట్టించుకోకవడంతో అనేక ప్రాంతా లు అంధకారమయంగా మారాయి. గణేశ్ ఉత్సవాల వేడుకలు కూడా చీకట్లోనే నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నా రు. రాత్రి వేళలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని అంటున్నారు. కొలాబా, సైన్-మాహిమ్‌లోని దాదాపు 416 వీధి దీపాల నిర్వహణ కాంట్రాక్ట్ గడువు ఈ ఏడాది ఆగస్ట్ 31వ తేదీతో ముగిసింది. దీంతో ఆ తర్వాత వీధి దీపాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. బెస్ట్ అధికారులు అందించిన వివరాల ప్రకారం.. ఈ 416 వీధి దీపాల నిర్వహణ బాధ్యత 2012 సెప్టెంబర్ నుంచి 2013 ఆగస్టు 31 వరకు ఉంది.
 
 అయితే కాంట్రాక్ట్ గడువును పునరుద్దరించే ప్రక్రియ సుదీర్ఘమైనది. చాలా ఆమోదాలు అవసరం ఉండడంతో దీని గడువు పునరుద్ధరించలేకపోయారు. బెస్ట్ సంస్థ దాదాపు 39, 700 వీధి దీపాలను నిర్వహిస్తోంది. అయితే ఇందు లో చాలా వీధి దీపాలు కొత్తవి. ఇందులో 416 వీధి దీపాల కాంట్రాక్టు గడువు ఆగస్టులో ముగిసింది. అయితే గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఈ వీధులు ప్రకాశవంతంగా కనిపించాలని స్థానికులు పేర్కొం టున్నారు. అయితే వీధి దీపాలు వెలగకపోవడంతో చీకటి నెలకొని ఉంది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
 
 ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
 ఈ వీధి దీపాల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  బెస్ట్ అధికార ప్రతినిధి తంబోలి అన్నా రు. కొత్త కాంట్రాక్టర్లకు బాధ్యతను అప్పగించేవరకు పాత కాంట్రాక్టర్లే నిర్వహణ బాధ్యతను చూసుకుంటారని  పేర్కొన్నారు. బెస్ట్ సంస్థ వీధి దీపాలకు బదులుగా ఎల్‌ఈడీ ల్యాంప్‌లను ఉపయోగించాల నే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. దీంతో కనీసం 40 శాతం విద్యుత్ ఆదా ఆవుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement