Ganesh festival celebrations
-
వినాయకుడి తొండం ఎటువైపు తిరిగి ఉంటే శ్రేయస్కరం
-
గణేష్ ఉత్సవాల్లో చిందేసిన శ్రీనివాసరావు
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): గణేష్ ఉత్సవాల్లో ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు కాసేపు సరదాగా చిందులు వేసి ఆ శాఖ ఉద్యోగుల్లో జోష్ నింపారు. టీఎన్జీవోస్ డీఎంహెచ్ఎస్ విభాగం అధ్యక్షుడు మామిడి ప్రభాకర్ ఆధ్వర్యంలో వైద్య,ఆరోగ్యశాఖ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాలకు మంగళవారం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఆడిపాడారు. అయితే కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటించాలని, మాస్క్ ధరించాలని ప్రజలకు జాగ్రత్తలు చెబుతోన్న ఆయనే మాస్కు లేకుండా డ్యాన్సులు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా తెలంగాణలో మంగళవారం నిర్వహించిన 76,481 కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 336 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,62,202కి చేరింది. ఒకరోజులో కరోనాతో ఒకరు మృతిచెందారు. -
హైదరాబాద్: నిరాడంబరంగా గణేష్ ఉత్సవాలు
-
మెల్బోర్న్లో గణపతి ఉత్సవాలు ముఖ్యఅథిదిగా రోజా
-
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన భారీ గణనాథుడు
-
వెలగని వీధి దీపాలు
సాక్షి, ముంబై: నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు వెలుగులు విరజిమ్మటం లేదు. వీటి బాధ్యతలను పర్యవేక్షించే కాంట్రాక్టర్ కాల పరిమితి ముగిసిందని పట్టించుకోకవడంతో అనేక ప్రాంతా లు అంధకారమయంగా మారాయి. గణేశ్ ఉత్సవాల వేడుకలు కూడా చీకట్లోనే నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నా రు. రాత్రి వేళలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని అంటున్నారు. కొలాబా, సైన్-మాహిమ్‌లోని దాదాపు 416 వీధి దీపాల నిర్వహణ కాంట్రాక్ట్ గడువు ఈ ఏడాది ఆగస్ట్ 31వ తేదీతో ముగిసింది. దీంతో ఆ తర్వాత వీధి దీపాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. బెస్ట్ అధికారులు అందించిన వివరాల ప్రకారం.. ఈ 416 వీధి దీపాల నిర్వహణ బాధ్యత 2012 సెప్టెంబర్ నుంచి 2013 ఆగస్టు 31 వరకు ఉంది. అయితే కాంట్రాక్ట్ గడువును పునరుద్దరించే ప్రక్రియ సుదీర్ఘమైనది. చాలా ఆమోదాలు అవసరం ఉండడంతో దీని గడువు పునరుద్ధరించలేకపోయారు. బెస్ట్ సంస్థ దాదాపు 39, 700 వీధి దీపాలను నిర్వహిస్తోంది. అయితే ఇందు లో చాలా వీధి దీపాలు కొత్తవి. ఇందులో 416 వీధి దీపాల కాంట్రాక్టు గడువు ఆగస్టులో ముగిసింది. అయితే గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఈ వీధులు ప్రకాశవంతంగా కనిపించాలని స్థానికులు పేర్కొం టున్నారు. అయితే వీధి దీపాలు వెలగకపోవడంతో చీకటి నెలకొని ఉంది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వీధి దీపాల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బెస్ట్ అధికార ప్రతినిధి తంబోలి అన్నా రు. కొత్త కాంట్రాక్టర్లకు బాధ్యతను అప్పగించేవరకు పాత కాంట్రాక్టర్లే నిర్వహణ బాధ్యతను చూసుకుంటారని పేర్కొన్నారు. బెస్ట్ సంస్థ వీధి దీపాలకు బదులుగా ఎల్ఈడీ ల్యాంప్‌లను ఉపయోగించాల నే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. దీంతో కనీసం 40 శాతం విద్యుత్ ఆదా ఆవుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.