‘ట్రబుల్ రన్!
గద్వాల:
సుమారు రెండొందల గ్రామాల దాహార్తి తీర్చేందుకు ఉద్ధేశించిన జూరాల భారీ తాగునీటి పథకం బాలారిష్టాలను దాటడం లేదు. ట్రయల్న్ ్రదశలోనే అడ్డుంకులు ఎదురవుతున్నాయి.
గద్వాల:
సుమారు రెండొందల గ్రామాల దాహార్తి తీర్చేందుకు ఉద్ధేశించిన జూరాల భారీ తాగునీటి పథకం బాలారిష్టాలను దాటడం లేదు. ట్రయల్న్ ్రదశలోనే అడ్డుంకులు ఎదురవుతున్నాయి. నీటిని పంపింగ్ చేసే సమయంలో ఒత్తిడికి పైపులు పగిలిపోవడం.. మళ్లీ వాటి స్థానంలో కొత్తవాటిని అమర్చడం.. అవీ పగిలిపోవడం వంటి ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో పనులు పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు చివరి అవకాశమిచ్చారు. ఇది ఈ మేరకు ఫలిస్తుందో చూడాలి! గద్వాల డివిజన్‌లోని 184 గ్రామాల ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించాలనే సంకల్పంతో సుమారు రూ.110 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం జూరాల భారీ తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టింది. కాగా, పనులు పూర్తిచేసుకొని 2012 ఆగస్టులో మొదటిదశలో ప్రధాన పంప్‌హౌస్ నుంచి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండగట్టు గ్రావిటీ జలశయం వరకు ట్రయల్న్ ్ర ర్వహించారు. ప్రక్రియ ప్రారంభమైందోలేదో ప్రధానలైన్‌కు అడుగడుగునా లీకేజీ ఏర్పడ్డాయి. దీంతో పథకం ప్రారంభాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. స్పందించిన ఉన్నతాధికారులు పైపులను మార్చేసి డీఐ పైప్‌లను అమర్చారు. ఎలాగోలా కొండగట్టుపైకి నీళ్లు ఎక్కించారు కానీ గ్రామాలకు పంపిణీ లైన్లద్వారా అందించే ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఇలా ఇప్పటివరకు ఏ ఒక్కగ్రామానికి నీళ్లివ్వలేకపోయారు. ఈ పరంపరలో టెస్టింగ్‌లను ప్రతి 500 మీటర్లకు ఒకచోట నిర్వహించాలని ఆర్‌డ బ్ల్యూఎస్ అధికారులు కాంట్రాక్టర్‌కు చివరి అవకాశమిచ్చారు. గత జూలైలో టెస్టింగులను కాంట్రాక్టర్ ప్రారంభించారు. ఒకచోట నిర్వహించిన టెస్టు సఫలమైనా..మరో రెండుచోట్ల విఫలమైంది. దీంతో నెలరోజుల క్రితం కాంట్రాక్టర్ పనులను నిలిపివేశాడు. స్థానిక ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా స్పందించకపోవడంతో చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్‌లోని ఈఎన్‌సీ కార్యాలయానికి లేఖలను రాశారు.
రూ.80కోట్లు మట్టిపాలు!
జూరాల భారీ తాగునీటి పథకం నిర్మాణం, పైప్‌లైన్ల ఏర్పాటుకు ఇప్పటివరకు దాదాపు రూ.80కోట్లు ఖర్చుచేశారు. మొదట శంకుస్థాపన సమయంలో హడ్కో ద్వారా రూ.35కోట్లు మంజూరుచేసిన ప్రభుత్వం ఆ తర్వాత నిధులను ఇతర పథకాల ద్వారా సమకూరుస్తూ వచ్చింది. తద్వారా ఫిల్టర్‌బెడ్స్, జూరాల రిజర్వాయర్‌లోని ఇంటెక్‌వెల్, కొండగట్టుపై గ్రావిటీ జలాశయాన్ని నిర్మించారు. కేవలం పైప్‌లైన్లలో నీటిఒత్తిడిని తట్టుకోలేని ఫైబర్ పైపులు వేయడంతో మొత్తం పథకం లక్ష్యం మట్టిపాలైంది.
ఉన్నతాధికారులకు లేఖ రాశాం :
ఈఈ మేఘారెడ్డి
భారీ తాగునీటి పథకంలో పంపిణీ లైన్లలో టెస్టింగ్‌లు నిర్వహించాలని అనుమతించగా, కాంట్రాక్టర్ పనులను చేయకుండా నిలిపివేసిన విషయమై చర్యల కోసం ఉన్నతాధికారులకు లేఖ రాశాం. కొండగట్టుపై ఉన్న రిజర్వాయర్ నుంచి గ్రామాలకు తాగునీటిని అందించే డిస్ట్రిబ్యూషన్ లైన్లలో లీకేజీల కారణంగా సమస్య ఉత్పన్నమైంది. ఉన్నతాధికారుల నిర్ణయంపై తదుపరి కార్యాచరణ ఉంటుంది.