కరీంనగర్ హెల్త్ : కరీంనగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రజల ప్రాణాలకు సంకటంగా మారారుు. సంబంధిత కాంట్రాక్టర్ నిబంధనలకు నీళ్లొదిలి పనులు సులువుగా జరిగేందుకు జిలెటిన్‌స్టిక్స్ వినియోగిస్తున్న విషయం శుక్రవారం బయటపడింది. డ్రైనేజీ పైపులైన్ నిర్మాణం కోసం స్టిక్స్ పేల్చి మట్టిని పెకిలించి దానిని పొక్లెరుునర్‌తో తొలగిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులపై పట్టపగలు పేలుడు పదార్థాలు ఉపయోగించడం వల్ల ప్రజలకు ప్రమాదం పొంచివుంది. అరుునప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు చూసీచూడనట్టు వ్యవహరించడంపై నగరవాసులు మండిపడుతున్నారు.
త్రుటితప్పిన పెను ప్రమాదం..
కరీంనగర్‌లోని మంచిర్యాల చౌరస్తా నుంచి చొప్పదండి రోడ్డులో భూగర్భ డ్రైనేజీ ని ర్మాణ పనుల కోసం క్రేన్ సహాయంతో తవ్వకాలు జరుపుతున్నారు. శుక్రవారం ఉదయం 11గంటల ప్రాంతంలో భూగర్భంలో అమర్చిన జిలెటిన్‌స్టిక్స్ ఒక్కసారిగా పెద్దశబ్దంతో పేలారుు. అదే సమయంలో బైక్‌పై భార్య, ఇద్దరు చిన్నారులతో వెళ్తున్న తీగలగుట్టపల్లికి చెందిన శ్రీనివాస్ భారీ శబ్దంతో భూమి కంపించినట్టు కావడంతో ఉలిక్కిపడి బైక్ అదుపుతప్పి కిందపడిపోయూడు. వాహనంపై ఉన్న అతని భార్య, చిన్నారులు లాహ్యప్రియ(3), సిద్దార్థ (10నెలలు)లకు నేల ఒరుసుకుపోరుు కళ్లు, నుదురు భాగంలో తీవ్రగాయూలయ్యూరుు.
శ్రీనివాస్ ఉదయం రోడ్డు ప్రమాదానికి గురికాగా.. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న భార్య ఇద్దరు పిల్లలతో ఆసుపత్రికి చేరుకుంది. చికిత్స చేరుుంచుకున్న అనంతరం శ్రీనివాస్ భార్యాపిల్లలతో ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వారిని స్థానిక కార్పొరేటర్ రాపర్తి విజయ సహకారంతో నగరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేరుుంచారు. ప్రమాదానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఓవైపు ప్రమాదం.. మరోవైపు పేలుళ్లు..
ప్రమాదం జరిగినపుడు స్పందించాల్సిన కాంట్రాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు ప్రమాదం జరిగి చిన్నారులు కొట్టుమిట్టాడుతుంటే.. అక్కడ పనిచేసే సిబ్బంది వెంటనే మళ్లీ జిలెటిన్‌స్టిక్స్ పేల్చి పనులు చేసుకున్నారని స్థానికులు తెలిపారు. తమ పిల్లలకు తీవ్రగాయాలయ్యాయని, నిబంధనలు పాటించని కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ దంపతులు డిమాండ్ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా..
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ తవ్వకాల్లో జిలెటిన్‌స్టిక్స్‌గానీ, ఇతర పేలుడు పదార్థాలుగానీ వాడరాదు. నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న క్వారీలు, భావుల తవ్వకాల్లో మాత్రమే మందుగుండు సామగ్రిని అధికారుల అనుమతితో వినియోగించాలని నిబంధనలున్నారుు. అండర్‌గ్రౌండ్ తవ్వకాల్లో మ్యాన్‌పవర్‌తోపాటు పనిముట్లు, యంత్రాలు మాత్రమే వినియోగించాలి. ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనుల్లో ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌శాఖ, కార్పొరేషన్ సహకారం అందించాలని, ప్రజలకు ఇబ్బందులు జరిగితే వెంటనే చర్యలు చేపట్టాలని ఈనెల 9న నిర్వహించిన అభివృద్ధి సమన్వయ కమిటీ సమీక్ష సమావేశంలో కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కానీ నగరంలోని జనమ్మర్ధ ప్రదేశాల్లో, అదీ పట్టపగలు పేలుళ్లు జరుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
తవ్వకాలు జరుపుతున్న ప్రదేశంలో ప్రమాద హెచ్చరికలు తెలిపే బోర్డులు, రెడ్ రిబ్బన్ వంటివి కూడా ఏర్పాటు చేయకపోవడం వారి నిర్లక్ష్యాన్ని చూపిస్తోంది. తవ్వకాలు జరుపుతున్న ప్రాంతంలో ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయూలని సూచిస్తే.. మీ పని మీరు చూసుకోండి అన్నారని కార్పొరేటర్ రాపర్తి విజయ తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారులు, కాంట్రాక్టర్‌పై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ప్రాణాలతో చెలగాటం
Published Sat, Feb 21 2015 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM
Advertisement
Advertisement