
సాక్షి, న్యూఢిల్లీ : మేఘాలయాలో బొగ్గు గనుల్లో చిక్కుకుపోయిన 13 మందిని రక్షించే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 13 నుంచి గనుల్లో చిక్కుకున్న మైనర్లను రక్షించేందుకు సహాయ చర్యల కోసం ప్రభుత్వం హై ప్రెజర్ పంప్‌లను సమకూర్చలేదని ఆరోపించారు. మేఘాలయలో అక్రమంగా నిర్వహిస్తున్న గనిలో పోటెత్తిన వరదల్లో చిక్కుకుని 13మంది కార్మికులు గల్లంతైన సంగతి తెలిసిందే.
బ్రహ్మపుత్ర నదిపై పొరుగున ఉన్న అసోంలో బోగీబీల్ బ్రిడ్జిపై ఫోజులు ఇచ్చే బదులు బొగ్గుగనిలో ఊపిరాడక సతమతమవుతున్న 13 మందిని కాపాడాలని రాహుల్ ట్వీట్ చేశారు. పరికరాలు లేకపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్న 15 మంది మైనర్లను రక్షించే ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన ఈస్ట్ జైంటియా హిల్స్ జిల్లాలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు సరిపడా పోలీసు బలగాలు లేవని మేఘాలయా హోం శాఖకు చెందిన సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment