బొగ్గుగనిలో పేలుడు సంభవించడంలో 8 మంది మృతి చెందారు
బీజింగ్: చైనాలోని ఓ బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించింది. లియాన్యుయాన్ నగరంలోని జుబావొ కోల్ మైన్‌లో సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
పేలుడు జరిగిన సమయంలో బొగ్గుగనిలో 29 మంది కార్మికులు పనిచేస్తున్నారని అధికారులు వెల్లడించారు. వీరిలో 17 మంది సురక్షితంగా బయటపడగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. యాంగ్ గ్వాన్‌గ్రోంగ్ వైస్ గవర్నర్ హునాన్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగతుతున్నాయి. టెంగ్ఫీ కోల్‌మైన్ కో లిమిటెడ్ ఆధ్వర‍్యంలో ఇక్కడ మైనింగ్ జరుగుతోంది. ప్రమాదంపై అధికారులు విచారణకు ఆదేశించారు.