ఒడిశాలోని సుందరగఢ్ జిల్లాలో శనివారం ఓ బొగ్గుగనిలో ఎత్తయిన బొగ్గు కుప్ప ఉన్నట్టుండి కూలిపోవడంతో పది మంది మృతిచెందగా ఐదుగురు గాయపడ్డారు.
భువనేశ్వర్/రూర్కెలా: ఒడిశాలోని సుందరగఢ్ జిల్లాలో శనివారం ఓ బొగ్గుగనిలో ఎత్తయిన బొగ్గు కుప్ప ఉన్నట్టుండి కూలిపోవడంతో పది మంది మృతిచెందగా ఐదుగురు గాయపడ్డారు. కుల్దాలోని మహానది కోల్‌ఫీల్డ్స్ కంపెనీ(ఎంసీఎల్)కి చెందిన వసుంధర-గర్జన్‌బహాల్ ఓపెన్ క్యాస్ట్ గనిలో పరిసర గ్రామాల ప్రజలు బొగ్గు ఏరుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. బొ గ్గు కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. వర్షాల వల్ల బొగ్గు కుప్ప కూలిపోయి ఉంటుందని అధికారులు చెప్పారు. మృతుల కుటుంబాలకు ఎంసీఎల్, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ప్రకటించాయి.