పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ ప్రాంతంలో నిన్న సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య మంగళవారానికి 238కి చేరుకుందని స్థానిక మీడియా వెల్లడించింది. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే క్షతగాత్రులు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. భూకంప తీవ్రతకు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయిని, ఆ నేపథ్యంలో సహాయ చర్యలకు విఘాతం ఏర్పడిందని చెప్పింది.
అప్పటికి మూడొందల మంది భద్రత, సరిహద్దు దళాలను ఇప్పటికే సహాయ చర్యలో పాల్గొన్నాయని వివరించింది. భూకంపాన్ని తీవ్రత దృష్ట్యా అవరణ్, మరో ఐదు జిల్లాలో అత్యవసర పరిస్థితిని బెలూచిస్థాన్ ముఖ్యమంత్రి అబ్దుల్ మాలిక్ బలొచి నిన్నే ప్రకటించిన విషయాన్ని మీడియా ఈ సందర్బంగా గుర్తు చేసింది. గాయపడిన వారికి వైద్య సాయం కోసం స్థానికంగా శిబిరాలను ఏర్పటు చేసి ఇప్పటికే వైద్య సాయం అందజేస్తున్నామని బెలూచిస్థాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు.