పెషావర్లో ఆర్మీ స్కూల్పై ఉగ్రవాదులు మారణోమం సృష్టించిన నేపథ్యంలో తాలిబాన్లపై పాకిస్థాన్ సైనిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇస్లామాబాద్: పెషావర్లో ఆర్మీ స్కూల్పై ఉగ్రవాదులు మారణోమం సృష్టించిన నేపథ్యంలో తాలిబాన్లపై పాకిస్థాన్ సైనిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం ఉదయం కరాచీలో ఇద్దరు తాలిబన్ తీవ్రవాదులను పాకిస్థాన్ ఆర్మీ మట్టుబెట్టింది. తమకు మారీపూర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడ ఆపరేషన్ చేపట్టినట్లు సీఐడి అధికారి ఒకరు తెలిపారు. గురువారం జరిపిన దాడిలో 50 మంది తాలిబన్ తీవ్రవాదులను హతమార్చగా, శుక్రవారం మరో 12 మందిని అంతమొందించారు.
పెషావర్ లో సైనిక స్కూల్‌పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రధాని నవాజ్‌షరీఫ్ ప్రభుత్వం తాలిబన్ ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. పెషావర్ దాడిలో132 మంది విద్యార్థులు సహా 148 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.