ధ్వంసమైన కారు
బలొచిస్తాన్ : పాకిస్తాన్‌లో 11వ జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్) ఎన్నికల పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చెలరేగాయి. బలొచిస్తాన్, క్వెట్టాలో ఉగ్రవాదులు బుధవారం ఉదయం ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 25 మంది మృతి చెందగా చాలా మంది గాయపడ్డారు. ఆస్ట్రన్ బైపాస్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల వాహనాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు కొనసాగించారు. అక్కడికి చేరుకున్న భద్రతాబలగాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నాయి.
ఇక ఈ ఉదయం 8 గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలవుతుంది. కేవలం 24 గంటల సమయంలోనే రాజకీయ పార్టీల భవితవ్యం తేలనుంది. దాదాపు పదికోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment