నైరుతి పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్లో నిన్న సంభవించిన భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య మంగళవారం ఉదయానికి 93 కి చేరింది.
నైరుతి పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్లో నిన్న సంభవించిన భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య మంగళవారం ఉదయానికి 93 కి చేరింది. మరో 200 మంది గాయపడ్డారు. వారు స్థానికంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ ఘటనలో మరణించనవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఆ భూకంపం ధాటికి పేక మేడల్లా కుప్పకులిన భవనాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ ఘటనపై పాక్ ప్రభుత్వ వెంటనే స్పందించింది. వైద్య బృందాలు, భద్రత దళాలు సహాయక చర్యల్లో పాల్గొనాలని పాక్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. బెలూచిస్థాన్ ప్రావెన్స్లో నిన్న మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేల్పై 7.7గా నమోదు అయింది.