
కరాచీ: పాకిస్తాన్ బలూచిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం ముస్తాంగ్ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న వ్యాన్ డ్రైవర్ అదుపు కోల్పోయి ఎదురుగా వచ్చిన బస్సును ఢీకొట్టాడు. ఈ ఘటనలో గాయపడిన వారందరినీ వెంటనే క్వెట్టాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో 14 మంది చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇంకా 30 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment