కరాచి: పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ ఫ్రావిన్స్‌లో శుక్రవారం ఒక రైలుపై జరిపిన బాంబు దాడిలో ఆరుగురు దుర్మరణం చెందగా, 14 మంది గాయాలపాలయ్యారు. రావల్పిండి-క్వెట్టా మధ్య ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ వెళ్లే పట్టాలపై బాంబులు అమర్చి రిమోట్ కంట్రోల్‌తో పేల్చారు.
ఈ దాడులను బెలూచిస్తాన్ ముఖ్యమంత్రి నవాజ్ సనావుల్లా జెహ్రీ ఖండించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ దాడులకు పాల్పడినట్లు ఇంతవరకు ఎవరూ ప్రకటించుకోలేదు.
పాక్‌లో రైలుపై బాంబు దాడి
Published Sat, Oct 8 2016 4:20 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
Advertisement
Advertisement