పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్లో భద్రతాదళాలు శనివారం జరిపిన కాల్పుల్లో 10 మంది తీవ్రవాదులు మరణించారని స్థానిక మీడియా ఆదివారం ఇక్కడ వెల్లడించింది. మండ్ నగర ప్రాంతంలో జరిగిన ఆ ఘటనలో పలు తీవ్రవాదులు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొంది. కాల్పులు జరిగిన సంఘటన స్థలంలో అధిక మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే భద్రతదళాల వైపు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని మీడియా తెలిపింది.