పాక్లో 20 'నాటో' ట్యాంకర్లపై ఉగ్రవాదుల దాడి | Militants torch NATO tankers in Pakistan | Sakshi
Sakshi News home page

పాక్లో 20 'నాటో' ట్యాంకర్లపై ఉగ్రవాదుల దాడి

Published Mon, Sep 16 2013 1:56 PM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM

Militants torch NATO tankers in Pakistan

పాకిస్థాన్లో 'నాటో' ఆయిల్ ట్యాంకర్లపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆదివారం రాత్రి బెలూచిస్థాన్ రాష్ట్రంలో 20 ట్యాంకర్లను పేల్చివేశారు. అఫ్ఘనిస్థాన్లోని నాటో దళాలకు ఆయిల్, ఇతర వస్తువులను సరఫరా చేస్తుండగా ఈ సంఘటన జరిగినట్టు పాక్ మీడియా వెల్లడించింది. హబ్ జిల్లాలో రోడ్డు పక్కన ఓ రెస్టారెంట్ సమీపంలో వాహనాల్ని ఆపిన సమయంలో సుమారు 10-15 మంది ఉగ్రవాదులు రాకెట్లతో మెరుపు దాడి చేసి పారిపోయినట్టు సమాచారం. ఆరు ట్యాంకర్లలో మంటలు రేగి ఇతర వాహనాలకు వ్యాపించడంతో భారీ నష్టం జరిగింది.


భద్రత దళాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి. బెలూచిస్థాన్ రాష్ట్రంలోని ఖుజ్దార్ జిల్లాలో శుక్రవారం కూడా ఉగ్రవాదులు దాడి చేసి తొమ్మిది నాటో ట్యాంకర్లను ధ్వంసం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement