లిబియా అంతర్గత విమానాన్ని ఇద్దరు దుండగులు హైజాక్ చేశారు. లిబియా ప్రభుత్వ రంగ సంస్థ ఆఫ్రికియా ఎయిర్ వేస్ కు చెందిన ఎయిర్ బస్ 320 అనే విమానాన్ని శుక్రవారం హైజాక్ చేశారు. 111 ప్రయాణికులలో బయలుదేరిన విమానాన్ని దారి మళ్లించి మాల్టా లో ల్యాండ్ చేసినట్టు, మాల్టీస్ మీడియా నివేదించింది. విమానాన్ని పేల్చివేస్తామని బెదిరిస్తున్నట్టు తెలిపింది.