సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన తెలంగాణా అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగోను ఖరారు చేసింది. ఇందులో తెలంగాణా సంస్కృతి ప్రతిబింబించడంతో పాటు దశాబ్ది ఉత్సవాలకు చిహ్నంగా 10 సంఖ్యతో లోగో డిజైన్ చేశారు. లోగో మధ్యలో తెలంగాణా తల్లి, పై భాగంలో ఎగురుతున్న రాష్ట్ర అధికార పక్షి పాలపిట్ట తీసుకున్నారు.
10 భాగాలుగా ..ఒక్కో భాగంలో ఒక్కో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల బొమ్మ ఉండగా, 10 సంఖ్యలోని 1 లో తెలంగాణా సంస్కృతికి ప్రతీకగా బతుకమ్మ పొందుపరిచారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు, , మిషన్ భగీరథ, సాంస్కృతిక, యాదాద్రి వంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు, జంటనగరాల తలమానికం హైదరాబాద్ మెట్రో రైల్, వ్యవసాయం టీ-హబ్, రాష్ట్రం ఏర్పడ్డ తరవాత ప్రభుత్వం ఒక సవాల్ గా స్వీకరించి కోతలు లేకుండా ప్రజలకు, ఉచితంగా రైతులకు కరెంటు అందిస్తోన్న విద్యుత్ రంగానికి స్థానం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చిహ్నాలను లోగోలో పొందుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment