సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సహకార సంఘంలో కొంత మంది కాంగ్రెస్‌లో చేరిన కారణంగానే తాను ఈ పదవిలో కొనసాగలేనని చెప్పుకొచ్చారు.
ఇక, తన రాజీనామా అనంతరం రవీందర్ రావు మీడియాతో మాట్లాడుతూ..‘ఇన్ని రోజులు నాకు అండగా ఉన్నవారికి ధన్యవాదాలు. సహకార సంఘంలో కొంత మంది ఇప్పుటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కానీ, నేను ఇంకా ఈ పదవిలో కొనసాగలేను. అందుకే రాజీనామా చేస్తున్నాను. 2015లో రాష్ట్ర సహకార బ్యాంకు ఆవిర్భావం జరిగింది. రాష్ట్ర సహకార బ్యాంకులో డైరెక్టర్లు పార్టీలు మారారు. విశ్వాసం కోల్పోయిన చోట ఉండవద్దని నేను నిర్ణయం తీసుకున్నాను. టెస్కాబ్ చైర్మన్‌గా నేను, వైస్ చైర్మన్ మహేందర్ రెడ్డి పదవులకు రాజీనామా చేస్తున్నాం.
గత తొమ్మిది సంవత్సరాలుగా సహకార వ్యవస్థలో ప్రగతి జరిగింది. రాష్ట్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా నేను తొమ్మిది సంవత్సరాలుగా ఉన్నాను. తెలంగాణ సహకార వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అనుసరించాలని నీతి ఆయోగ్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకుకు అనేక అవార్డులు వచ్చాయి. ఈ ప్రభుత్వ విధానాలు అందరికి బాగుండేలా ఉండాలి. సహకార వ్యవస్థలో మేము రిటైర్డ్ అధికారులను పెట్టలేదు. నేను నా ఇష్టం వచ్చినట్లు ఎవరికీ పదవులు ఇవ్వలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావుకు కొద్ది రోజుల క్రితమే టెస్కాబ్ డైరెక్టర్లు అవిశ్వాస తీర్మాణం నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అవిశాస్వ తీర్మాణానికి ముందే రవీందర్ రాజీనామా చేయడం విశేషం. మరోవైపు.. రవీందర్ రావును కూడా పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అయితే, రవీందర్ రావు మాజీ మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో తాను పార్టీ మారలేనని చెప్పినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment