Konduri Ravinder Rao
-
టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సహకార సంఘంలో కొంత మంది కాంగ్రెస్‌లో చేరిన కారణంగానే తాను ఈ పదవిలో కొనసాగలేనని చెప్పుకొచ్చారు.ఇక, తన రాజీనామా అనంతరం రవీందర్ రావు మీడియాతో మాట్లాడుతూ..‘ఇన్ని రోజులు నాకు అండగా ఉన్నవారికి ధన్యవాదాలు. సహకార సంఘంలో కొంత మంది ఇప్పుటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కానీ, నేను ఇంకా ఈ పదవిలో కొనసాగలేను. అందుకే రాజీనామా చేస్తున్నాను. 2015లో రాష్ట్ర సహకార బ్యాంకు ఆవిర్భావం జరిగింది. రాష్ట్ర సహకార బ్యాంకులో డైరెక్టర్లు పార్టీలు మారారు. విశ్వాసం కోల్పోయిన చోట ఉండవద్దని నేను నిర్ణయం తీసుకున్నాను. టెస్కాబ్ చైర్మన్‌గా నేను, వైస్ చైర్మన్ మహేందర్ రెడ్డి పదవులకు రాజీనామా చేస్తున్నాం.గత తొమ్మిది సంవత్సరాలుగా సహకార వ్యవస్థలో ప్రగతి జరిగింది. రాష్ట్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా నేను తొమ్మిది సంవత్సరాలుగా ఉన్నాను. తెలంగాణ సహకార వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అనుసరించాలని నీతి ఆయోగ్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకుకు అనేక అవార్డులు వచ్చాయి. ఈ ప్రభుత్వ విధానాలు అందరికి బాగుండేలా ఉండాలి. సహకార వ్యవస్థలో మేము రిటైర్డ్ అధికారులను పెట్టలేదు. నేను నా ఇష్టం వచ్చినట్లు ఎవరికీ పదవులు ఇవ్వలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావుకు కొద్ది రోజుల క్రితమే టెస్కాబ్ డైరెక్టర్లు అవిశ్వాస తీర్మాణం నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అవిశాస్వ తీర్మాణానికి ముందే రవీందర్ రాజీనామా చేయడం విశేషం. మరోవైపు.. రవీందర్ రావును కూడా పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అయితే, రవీందర్ రావు మాజీ మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో తాను పార్టీ మారలేనని చెప్పినట్టు తెలుస్తోంది. -
రేపు సిరిసిల్లకు గులాబీ దళపతి
సిరిసిల్లటౌన్ : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ మంగళవారం జిల్లాకేంద్రానికి రానున్నారు. ఈమేరకు పార్టీ శ్రేణులు జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్డు శివారు ప్రైవేటు స్థలంలో భారీబహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో వేదికను ఏర్పాటు చేస్తుండగా పనులను ఆదివారం కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పరిశీలించారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావుతో పాటుగా ఆయన సభాస్థలికి చేరుకుని పర్యవేక్షించారు. భారీబహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. వరుసగా రెండురోజులపాటు ఆయన సిరిసిల్లకు వచ్చి సభాస్థలిని పర్యవేక్షిస్తూ..ఏర్పాట్లపై పార్టీ నేతలకు సూచనలు చేశారు. 50 వేల మందికి సరిపడా.. బైపాస్ రోడ్డులో సుమారు 20ఎకరాల ప్రైవేటు స్థలాన్ని చదును చేసి భారీస్థాయిలో వేదికను రూపొందిస్తున్నారు. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలస్థాయి భారీ బహిరంగ సభ కావడం విశిష్టత చేకూరింది. ఇరు నియోజకవర్గాల ప్రజలకు అనుకూలం కావడంతో సిరిసిల్ల బైపాస్‌రోడ్డును కేసీఆర్ సభకు ఎంపిక చేశారు. సభాస్థలకి సమీపంలోనే హెలిప్యాడ్ నిర్మిస్తున్నారు. సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో సీఎం సభ ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా జరగుతున్నాయి. సుమారు 50 వేల మంది వరకు సభకు హాజరు అవుతారని అంచనా వేసి ఏర్పాట్లను చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు కేసీఆర్ వచ్చి ఇరు నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి సభలో ప్రసంగించి వెళ్లనున్నారు. ఉరకలెత్తిన ఉత్సాహం.. సీఎం కేసీఆర్ సిరిసిల్లకు రానుండటంతో గులాబీ పార్టీలో కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. మూడ్రోజులుగా సిరిసిల్ల నాయకత్వం సభ ఏర్పాట్ల పనుల్లో నిమగ్నమయ్యారు. గత ఎన్నికల్లో సైతం కేసీఆర్ సభ తర్వాత పార్టీ ప్రచారం తారాస్థాయికి చేరి 2014 ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కేటీఆర్, వేములవాడ నుంచి చెన్నమనేని రమేశ్‌బాబు గెలుపొందారు. కార్మిక, ధార్మిక క్షేత్రాలైన సిరిసిల్ల, వేములవాడలకు కేసీఆర్ ఇవ్వబోయే వరాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
‘ఆర్థిక ప్రోత్సాహానికి మొబైల్ ఏటీఎంలు’
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ ఆర్థిక అక్షరాస్యతను ప్రొత్సహించేందుకు నాబార్డు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఫండ్ (ఎఫ్ఐఎఫ్) ద్వారా మొబైల్ ఏటీఎం వ్యాన్లు కొనుగోలు చేశామని టీస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టీఎస్ఎస్సీఏబీ) ఉన్నతాధికారులు వ్యాన్ల తాళాలను డీసీసీబీల ముఖ్య కార్యనిర్వహణ అధికారులకు అందజేశారు. ఈ వ్యాన్లు హైదరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో సంచరిస్తాయన్నారు. సమావేశంలో నాబార్డ్ సీజీఎం రాధాకృష్ణ, టీస్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్, టీ స్కాబ్ సీబీఎం జ్యోతి పాల్గొన్నారు. -
మౌలిక వసతుల కల్పనకు కృషి
► టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు గంభీరావుపేట: గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రభు్వం కృషి చేస్తుందని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. మల్లుపల్లిలో రూ. 13లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి గురువా రం భూమి పూజ చేశారు. అదే విధంగా రూ. 4 కోట్లతో కొత్తపల్లి, ము చ్చర్ల గ్రామాల మధ్య చేపట్టబోయే బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామా ల సమగ్రాభివృద్ధికి మంత్రి కేటీఆర్ చొరువతో నిధులు మంజూరవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కమ్మరి గంగసాయవ్వ, సెస్ డైరెక్టర్ దేవేందర్‌యాదవ్, సర్పంచ్‌లు పద్మ, నాగరాజుగౌడ్, మల్లేశం, ఉప సర్పంచ్ శేఖర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ సంపూర్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు దయాకర్‌రావు, మాజీ అధ్యక్షులు రాజారాం, మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్, ఎంపీడీవో సురేందర్‌రెడ్డి, పీఆర్ డీఈ చంద్రశేఖర్, ఏఈ సాయిలు పాల్గొన్నారు. -
కరువులోనూ 100 శాతం రుణాల రికవరీ
రుణాలు రికవరీ చేసిన సంఘాలకు రూ. 50 వేల ప్రోత్సాహకాలు టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు కరీంనగర్‌అగ్రికల్చర్: జిల్లాలో కరువు పరిస్థితుల్లోనూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు 100 శాతం రికవరీ కావడం అభినందనీయమని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. రుణాల రికవరీకి కృషిచేసిన 56 సంఘాలకు రూ.50 వేల చొప్పున ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం కేడీసీసీబీ జిల్లా సర్వసభ్య సమావేశం టెస్కాచ్ చైర్మన్ అధ్యక్షతన జరిగింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.1450 కోట్ల వ్యాపార లావాదేవీలకు రూ.20.97 కోట్ల లాభం ఆర్జించిందని తెలిపారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.2000 కోట్ల వ్యాపార లక్ష్యానికి గాను ఇప్పటికే రూ.500 కోట్ల అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. ఏటా సంఘంలో ఖర్చుచేసే ప్రతి లావాదేవీలను చెక్కుల ద్వారా చేయాలని సూచించారు. సంఘాలు మైక్రో ఏజెన్సీస్ ద్వారా డిపాజిట్ మోబిలైజేషన్ చేయాలని, అలా చేసిన డిపాజిట్లపై మంచి కమీషన్ వస్తుందన్నారు. తద్వారా బ్యాంకులోనూ డిపాజిట్స్ పెరుగుతాయన్నారు. 15 బ్యాంకు శాఖల్లో ఏటీఎంలు, 138 మైక్రో ఏటీఎంల ద్వారా త్వరలో సేవలు విస్తరిస్తామన్నారు. నాబార్డు ద్వారా రూ.23 కోట్లు వ్యవసాయేతర రునాల మంజూరు కోసం 31 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నిధులు ఇచ్చినట్లు వెల్లడించారు. బ్యాంకు అనుబంధంగా 34 చేనేత సహకార సంఘాలు అభివృద్ధికి సహకరిస్తామన్నారు. సమావేశంలో డెప్యూటీ జనరల్ మేనేజర్ ముప్పిడి రవీందర్‌రెడ్డి, మేనేజర్ ఎ.నారాయణరెడ్డి, బ్యాంకు ఉపాధ్యక్షుడు వుచ్చిడి మోహన్‌రెడ్డి, డీసీఏవో చంద్రప్రకాశ్‌రెడ్డి, డిప్యూటీ జన రల్ మేనేజర్ జె.నారాయణ, డీఆర్, ఓఎస్డీ ఇంద్రసేనారెడ్డి, పీడీసీ రిసోర్స్ పర్సన్ జి.సత్యనారాయణ తదితరులు ఉన్నారు.