'Don't touch me': Aahana Kumra gets angry as fan puts his arm around her waist - Sakshi
Sakshi News home page

Aahana Kumra: హీరోయిన్‌ నడుముపై చేయి.. ఆగ్రహం వ్యక్తం చేసిన నటి

Published Sun, May 21 2023 2:56 PM | Last Updated on Sun, May 21 2023 3:43 PM

Aahana Kumra gets angry as a fan puts his arm around her waist  - Sakshi

బాలీవుడ్‌ నటి ఓ అభిమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఐదేళ్ల వార్షికోత్సవంలో ముంబయిలో జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్న నటి అహన కుమ్రా నడుముపై ఓ అభిమాని చేయి వేశారు. ఈ చర్య అహన కుమ్రాకు కోపం తెప్పించింది. దీంతో డోంట్ టచ్‌ మీ అంటూ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరలవుతోంది. 

(ఇది చదవండి: బుల్లితెర హీరోయిన్‌ వెండితెరపైకి.. వరుస ఛాన్సులు)

ఇది చూసిన నెటిజన్స్ అభిమాని చేసిన పనిని తప్పుబడుతున్నారు. ఆ సమయంలో అహనా చాలా వేగంగా స్పందించిందని ప్రశంసిస్తున్నారు. ఎవరైనా పర్మిషన్ లేకుండా అలా తాకడం తప్పని చెబుతున్నారు.  

కాగా.. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన యుధ్ అనే టీవీ షోతో అహన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, ఇండియా లాక్ డౌన్ లాంటి చిత్రాల్లో కూడా ఆమె నటించారు. ప్రస్తుతం ఆమె షరీబ్ హష్మీతో కలిసి క్యాన్సర్ అనే చిత్రంలో నటించనున్నారు. 

(ఇది చదవండి: ఆ దేవుడు నన్ను కరుణించలేదు: జబర్దస్త్‌ యాంకర్‌ ఎమోషనల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement