సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులకు కోపం వచ్చినా వెంటనే తమ పిల్లలను దగ్గరకు తీసుకుంటారని, అలాగే ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి సీఎం పోస్టులో ఉన్న కేసీఆర్‌కు వీఆర్‌ఏలపై కోపం తగదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. మూడు నెలలుగా వీఆర్‌ఏలకు జీతాలు లేవని, వారంతా ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
దసరా పండుగ సందర్భంగా అయినా వారి సమస్యలను పరిష్కరించి దసరా కానుక ఇవ్వాలని ఆదివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి అన్నారు. సమ్మెలో ఉన్న వారంతా జీతాలు లేక అవస్థల పాలవుతున్నారని, ఈ సమ్మె కాలంలోనే 28 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. వీఆర్‌ఏలకు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన విధంగా పేస్కేల్ అమలు చేయాలని, పదోన్నతులు, వారసులకు ఉద్యోగాలిచ్చే జీవోలను విడుదల చేయాలని కోరారు. సీఎం పెద్ద మనసుతో ఆలోచించి వీఆర్‌ఏల సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని జగ్గారెడ్డి విజ్ఞప్తిచేశారు.
చదవండి: బీజేపీకి కొత్త పేరు చెప్పిన కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment