
ఆందోళన చేస్తున్న హనుమన్ దీక్షపరులు
రాయికల్(జగిత్యాల): మండలంలోని కిష్టంపేట, సింగరావుపేట, అల్లీపూర్ గ్రామాలకు చెందిన హనుమాన్ దీక్షాపరులు సోమవారం ఆయా గ్రామాల నుంచి అయోధ్య గ్రామానికి శోభాయాత్రగా వెళ్తుండగా.. ఎస్సై శివకృష్ణ డీజే సౌండ్‌బాక్స్‌లు, జెండాలు తొలగించాలని కోరడంతో దీక్షాపరులు ఎస్సై తీరుపట్ల ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ తాము శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహించుకుంటే ఎస్సై డీజేను, కాషాయ జెండాలను తొలగించాలనడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షాపరులకు బీజేపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment