Hanuman devotees
-
మూడు కొండలెక్కితేగానీ చేరుకోని ఆ ఆలయానికి..
హిందూ దేవుళ్లలో హనుమంతుని ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అంతా హనుమంతుడిని భక్తిగా కొలుస్తారు. అలాంటి హనుమంతుని జన్మస్థలంగా భావించే నాసిక్‌లో అంజనేరి కొండల వద్ద ఉన్న ఆ స్వామి గుడిని సందర్శించడాని భక్తులు ఎన్నో ప్రయాసలు పడి వెళ్లాల్సి వస్తోంది. నిటారుగా ఉన్న ఆ రహదారి వెంబడి వెళ్లాలంటే సుమారు రెండు నుంచి మూడు గంటలు పడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆలయానికి త్వరితగతిన చేరుకునేలా రోప్‌వే నిర్మించాలని నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో బ్రహ్మగిరి ట్రెక్కింగ్ పాయింట్ నుంచి అంజనేరి కొండల వరకు ఈ రోప్ వేని నిర్మించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏ1) పర్వరత్మల పథకం కింద ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టెండర్లను ఆహ్వానించింది. ఇక హనుమంతుని జన్మస్థలం అయిన అంజనేరి కొండలు వద్ద ఆ స్వామికి సంబంధించిన గుహ తోపాటు అంజనీమాత ఆలయం కూడా ఉంది. వీటిని యాత్రికులు, ట్రెక్కర్లు సందర్శిస్తారు. సుమారు 4 వేల అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే మూడు పర్వతాలు ఎక్కాలి. ఇక్కడకు 5.7 కి.మీ పొడవున్న రోప్‌వే మూడు పర్వతాల మీదుగా వస్తే పైకి వెళ్లే ప్రయాణం కొన్ని నిమిషాలకు తగ్గిపోతుంది. కాగా, 2024 నాటికి మొత్తం 18 రోప్‌వే ప్రాజెక్టులను కేంద్ర ప్లాన్ చేస్తునట్లు సమాచారం. (చదవండి: కోడి ముందా.. గుడ్డు ముందా? ఎట్టకేలకు సమాధానం ఇచ్చిన శాస్త్రవేత్తలు) -
సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలి
కథలాపూర్(వేములవాడ): దేశ సంస్కృతిని ప్రపంచదేశాలు ప్రశంసిస్తున్నాయని, హిందు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందామని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. మంగళవారం కథలాపూర్ మండలంలో భజరంగ్‌దళ్ కార్యకర్తల ఆధ్వర్యంలో వీరహనుమాన్ విజయయాత్ర నిర్వహించారు. అంతకుముందు కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. వివేకానందుడు దేశం గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలు చాటిచెప్పారని, ఆయన దేశంలో జన్మించడం గర్వకారణని పేర్కొన్నారు. హిందు ధర్మం సైన్స్‌తో ముడిపడి ఉందన్నారు. విభిన్న భాషలు మాట్లాడేవారు దేశంలో ఉన్నారని, రాముడి పాలనను ఆదర్శంగా తీసుకోవడంతో ధర్మం, న్యాయం ఆచరిస్తున్నారని పేర్కొన్నారు. ఆంజనేయస్వామి తన గురువు అయిన రాముడి కోసం ఎన్నో త్యాగాలు చేశారని, వారి చరిత్రను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హిందు ధర్మం అన్ని వర్గాలవారిని, మతా లవారిని సమానంగా ఆదరిస్తుందన్నారు. అనంతరం భజరంగ్‌దళ్ కార్యకర్తలు మండలకేంద్రం నుంచి భూషణరావుపేట, చింతకుంట, దుంపేట, పోసానిపేట, తాండ్య్రాల గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హనుమాన్దీక్షాపరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
హనుమాన్ దీక్షాపరుల ఆందోళన
రాయికల్(జగిత్యాల): మండలంలోని కిష్టంపేట, సింగరావుపేట, అల్లీపూర్ గ్రామాలకు చెందిన హనుమాన్ దీక్షాపరులు సోమవారం ఆయా గ్రామాల నుంచి అయోధ్య గ్రామానికి శోభాయాత్రగా వెళ్తుండగా.. ఎస్సై శివకృష్ణ డీజే సౌండ్‌బాక్స్‌లు, జెండాలు తొలగించాలని కోరడంతో దీక్షాపరులు ఎస్సై తీరుపట్ల ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ తాము శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహించుకుంటే ఎస్సై డీజేను, కాషాయ జెండాలను తొలగించాలనడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షాపరులకు బీజేపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. -
హనుమాన్ భక్తుల ధర్నా!
నిజామాబాద్: రెంజల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆంజనేయ స్వామి భక్తులు ఆదివారం ధర్నాకు దిగారు. ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కందకుర్తి గ్రామంలో గంగాధర్ అనే వ్యక్తిని కొట్టడంతో.. గొడవ ఆపడానికి వెళ్లిన ఆంజనేయ స్వామి భక్తుల్ని తోసేశారు. ఈ ఘటనలో ఆంజనేయస్వామి భక్తులకు కూడా చిన్నపాటి దెబ్బలు తగిలాయి. గంగాధర్ అనే వ్యక్తి ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో 13 మందిని అరెస్టు చేయాలని రెంజల్ మండలంలోని సుమారు 100 మంది భక్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. (రెంజల్) -
ఓ రామా.. ఏమిటీ దురవస్థ...!
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఇరుముడులు సమర్పించేందుకు వచ్చిన హనుమాన్ భక్తులు గోదావరి స్నానఘాట్ల వద్ద తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గోదావరి తీరంలో ఎటు చూసినా అపరిశుభ్ర వాతావరణమే కనిపించటంతో.. స్నానాలు చేయడానికి కూడా సంకోచించారు. అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాచలం వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయడంలో ఇటు రామాలయం, అటు పంచాయతీ అధికారులు ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. వారి నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. శ్రీరామ నవమి, ముక్కోటి ఉత్సవాల తరువాత హనుమాన్ జయంతికి జిల్లాతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి హనుమాన్ మాలధారులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈసారి సుమారు 50వేలకు పైగానే భక్తులు రావచ్చని ముందుగానే అంచనా వేసిన అధికారులు.. తదనుగుణంగాఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. స్నాన ఘాట్ల వద్ద కనీసంగా చెత్త కుండీలను కూడా ఏర్పాటు చేయలేదు. ఉన్న ఒక్క కుండీ వ్యర్థాలతో నిండింది. ఆ చెత్తచెదారం, దుర్వాసన మధ్యనే కొందరు హనుమాన్ భక్తులు ‘ఓ రామా.. ఏమిటీ దురవస్థ..’ అనుకుంటూ స్నానాలాచరించారు. గోదావరి తీరంలోని అపరిశుభ్ర వాతావరణంలో స్నానమాచరించేందుకు మనసొప్పని అనేకమంది భక్తులు.. నావలపై గోదావరి మధ్యలోకి వెళ్లి పుణ్యస్నానాలు చేసి వచ్చారు. ఒడ్డునే మొక్కులు.... భక్తులు తలనీలాలు సమర్పించేందుకు గోదావరి ఒడ్డున తాత్కాలిక కళ్యాణ కట్ట ఏర్పాటు చేయా లి. హనుమాన్ జయంతికి అధికారులు ముందస్తుగా ఇటువంటి ఏర్పాట్లేమీ చేయలేదు. దీంతో, మాలధారులు, భక్తులు తమ వెంట తెచ్చుకున్న క్షురకుడితో గోదావరి ఒడ్డునే తలనీలాల మొక్కులు తీర్చుకున్నారు. గోదావరి తీరమంతా ఆ జుట్టుతో అపరిశుభ్రంగా తయారైంది.