
హనుమాన్ భక్తుల ధర్నా!
నిజామాబాద్: రెంజల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆంజనేయ స్వామి భక్తులు ఆదివారం ధర్నాకు దిగారు. ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కందకుర్తి గ్రామంలో గంగాధర్ అనే వ్యక్తిని కొట్టడంతో.. గొడవ ఆపడానికి వెళ్లిన ఆంజనేయ స్వామి భక్తుల్ని తోసేశారు. ఈ ఘటనలో ఆంజనేయస్వామి భక్తులకు కూడా చిన్నపాటి దెబ్బలు తగిలాయి. గంగాధర్ అనే వ్యక్తి ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో 13 మందిని అరెస్టు చేయాలని రెంజల్ మండలంలోని సుమారు 100 మంది భక్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.
(రెంజల్)